Nagarjuna: వైరల్ అవుతున్న నాగార్జున స్టేట్మెంట్!

అక్కినేని ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్. అయితే మిగిలిన స్టార్స్ పిల్లలు వాళ్ల తండ్రుల కంటే స్టార్డం సంపాదిస్తుంటే పాపం అక్కినేని కుటుంబంలో మాత్రం ఇప్పటికీ పిల్లలు ఇద్దరి కంటే తండ్రి బెటర్ అన్న ఒపీనియన్ ప్రేక్షకులలో ఉంది. దీనికి కారణం ఇప్పటికీ కూడా నాగచైతన్య, అఖిల్ ఖాతాలో ఓ మంచి సక్సెస్ రాకపోవడం. ఈ విషయం పక్కన పెడితే నాగచైతన్య గురించి నాగార్జున ఫర్ షాకింగ్ సీక్రెట్ బయటపెట్టారు.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన కొడుకు నాగచైతన్య ఎవరితోనో ప్రేమలో పడ్డాడు అంటూ ఓ ఇంటర్వ్యూలో నాగార్జున పేర్కొనడం జరిగింది. మావాడు కనీసం ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదు.. ఎప్పుడు ఫోన్ లో బిజీగా ఉంటాడు అని నాగార్జున అన్నారు. తిండి కూడా సరిగ్గా తినకుండా ఆ అమ్మాయి ధ్యాసలో నాగచైతన్య గడుపుతూ ఉంటాడట.

నాగచైతన్య బాలకం చూసి పూర్తిగా ప్రేమలో మునిగిపోయాడు అని అర్థం చేసుకున్న నాగార్జున ఎన్నోసార్లు విషయం చెప్పు అని అడిగిన అలాంటిదేమీ లేదు అని దాటేసేవాడట. అయితే నాగార్జున మాత్రం ఇది కచ్చితంగా లవ్ ఫీవర్ అని ఫిక్స్ అయిపోయారు అంట. అయితే ఇదంతా రీసెంట్ గా జరిగింది అని అనుకుంటున్నారేమో…ఇదంతా ఒకప్పుడు చైతు సమంతతో పీకల లోతు ప్రేమలో ఉండే టైంలో జరిగిన విషయం.

అదే సమయంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున (Nagarjuna) ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ పాత వీడియో తిరిగి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దాంతో చాలామంది రీసెంట్ గా నాగచైతన్య ఎవరితోనో ప్రేమలో ఉన్నాడా అని తెగ డౌటు పడిపోతున్నారు.

బ్రో సినిమా రివ్యూ & రేటింగ్!

‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus