Bro Movie: ‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘బ్రో’ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో మెయిన్ రోల్ సాయి ధరమ్ తేజ్..దే అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ పైనే ఈ సినిమాకి ఎక్కువ బిజినెస్ జరిగింది అనేది వాస్తవం. పవన్ కళ్యాణ్ వల్లే హౌస్ ఫుల్ బోర్డులు పడతాయి అనడంలో కూడా అతిశయోక్తి లేదు. ఇక సాయి తేజ్ సరసన కేతిక శర్మ నటించింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు.

అంతేకాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం కూడా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఇక జూలై 28 న(ఈరోజు) రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తుంది. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవే ఈ చిత్రానికి మైనస్ గా మారాయి అని చెప్పాలి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఈ సినిమా తమిళంలో రూపొందిన ‘వినోదయ సీతమ్’ కి రీమేక్. ఒరిజినల్ తో పోలిస్తే సాయి ధరమ్ తేజ్ పాత్రని కంప్లీట్ గా మార్చేశారు. అక్కడ తండ్రి పాత్ర అయితే ఇక్కడ పెద్ద కొడుకు పాత్ర అతనిది. ఆ మార్పు బాగానే ఉంది. కానీ ఆ పాత్రకి సాయి ధరమ్ తేజ్ ఎందుకో సెట్ అయినట్టు అనిపించదు.

2) ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ లుక్స్ పై సెటైర్లు కూడా వినిపించే అవకాశం ఉంది. ట్రోలింగ్ బ్యాచ్ కి స్టఫ్ ఇవ్వడానికే అన్నట్టు సాయి ధరమ్ తేజ్ తో ఓల్డ్ గెటప్ వేయించారు. అలాగే అతను కొన్ని షాట్స్ లో బాగానే ఉన్నా.. మరికొన్ని యాంగిల్స్ లో చాలా లావుగా కనిపిస్తాడు.

3) గతంలో సాయి ధరమ్ తేజ్ నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేయలేదు. నిజజీవితంలో కూడా సాయి తేజ్.. కల్మషం లేని వ్యక్తి. ఈ సినిమాలో సాయి తేజ్ ను నెగిటివ్ గా చూపించడం కన్విన్సింగ్ గా అనిపించదు.

4) అలాగే సాయి ధరమ్ తేజ్ పాత్ర ఎమోషనల్ కూడా కనెక్ట్ అవ్వదు. రెండో చెల్లి పుట్టినప్పుడు అతని తండ్రి చనిపోయాడు అని ఆమెను నెగిటివ్ గా చూడటం. ఆమె యూనివర్సిటీలో పై చదువులు చదువుతాను అంటే నా దగ్గర డబ్బులు లేవు అనడం. కానీ అతను ఖరీదైన బిల్డింగ్ లో, కార్లలో తిరుగుతుండటం.. అంతుచిక్కని ప్రశ్నలు. ఇక తన సోదరుడు, చెల్లెల్లు చిన్నప్పుడే తండ్రిని కోల్పోతే..! ఓల్డ్ లుక్ లో అతని తండ్రిని సాయి తేజ్ లో చూసుకోవడం కూడా కన్విన్సింగ్ గా ఉండకపోగా చిరాకు తెప్పిస్తుంది.

5) బ్రహ్మానందం పాత్ర ఎందుకు పెట్టారో అర్థం కాదు. అటు కామెడీకి కాకుండా.. ఇటు సీరియస్ గాను కాకుండా అలా వచ్చి వెళ్ళిపోతుంది ఆ పాత్ర.

6) తమన్ సంగీతంలో రూపొందిన పాటలు ఆకట్టుకోవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా.. సరైన సాంగ్స్ లేకపోవడం, అక్కడక్కడా వచ్చే బిట్ సాంగ్స్ కూడా రిజిస్టర్ కావు.

7) త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే,మాటలు అందించారు. స్క్రీన్ ప్లే సంగతి పక్కన పెడితే.. త్రివిక్రమ్ మార్క్ గుర్తుపెట్టుకునే డైలాగులు ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా లేవనే చెప్పాలి.

8) ఇక పవన్ కళ్యాణ్ తన గత సినిమాల్లోని గెటప్స్ లో కనిపిస్తూ.. అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు. సిట్యుయేషన్ తో సంబంధం లేకుండా పవన్ పాత సినిమాల్లోని పాటలు రావడం.. తనని తానే ఇమిటేట్ చేసుకునే ప్రయత్నం పవన్ చేయడం .. అభిమానులకు కూడా చిరాకు తెప్పిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.

9) తల్లి తన కూతుర్ని చూడడానికి వెళ్తుంటే.. ‘భీమ్లా నాయక్’ లోని ‘లాలా’ పాట ఎందుకు వస్తుందో.. తర్వాత దర్శకుడు సముద్రఖని ఎందుకు ఎంట్రీ ఇస్తాడో.. అని నెత్తి కొట్టుకునే ప్రేక్షకులు చాలా మందే ఉండొచ్చు.

10) ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టేస్తే సెకండ్ హాఫ్ లో చాలా బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా నీరసం తెప్పిస్తుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus