Bro Movie: ‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన ‘బ్రో’ సినిమా జూలై 28 న విడుదల కాబోతోంది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. టీజర్, ట్రైలర్స్ ఈ సినిమా పై ఆసక్తిని పెంచాయి. కానీ పాటలకి సో సో రెస్పాన్స్ మాత్రమే లభించింది. మరోపక్క నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలు కూడా ఈ చిత్రాన్ని చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్ అసలకి అడ్డుపడుతున్నట్లు కొందరు భావిస్తున్నారు. అయినప్పటికీ ఈ చిత్రాన్ని తప్పకుండా వీక్షించడానికి గల కొన్ని కారణాలు కొన్ని ఉన్నాయి.అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ తర్వాత మరో సినిమాలో కనిపించింది లేదు. ఆ సినిమా వచ్చి ఏడాది దాటేసింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ .. కాలానికి రూపం అంటూ ఉంటే ఎలా ఉంటారో.. అల కనిపించబోతున్నారు. ఆయన వింటేజ్ లుక్స్ లో కనిపించబోతున్నారు.

2) విరూపాక్ష వంటి బడా బ్లాక్ బస్టర్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మూవీ ఇది. ఇందులో మార్కండేయ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. నిజ జీవితంలో అతను ఫేస్ చేసిన కొన్ని ఇన్సిడెంట్లు ఈ మూవీలో ఉన్నాయి.

3) పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు మెగా అభిమానులను ఎంటర్టైన్ చేయడమే కాకుండా.. కంటతడి కూడా పెట్టిస్తాయట.

4) తమిళంలో రూపొందిన ‘వినోదయ సీతమ్’ కి ఇది రీమేక్. ఆ సినిమా అక్కడ ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది.థీమ్ కూడా చాలా బాగుంటుంది. తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి చాలా మార్పులు చేశారు.

5) సముద్రఖని దాదాపు 10 ఏళ్ళ తర్వాత తెలుగులో తీసిన సినిమా ఇది. అతని సినిమాల్లో చాలా మంచి కాన్సెప్ట్ ఉంటుంది అనే సంగతి తెలిసిందే.

6) ‘బ్రో’ కి మాటల స్టార్ డైరెక్టర్ అలాగే మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించారు. ఇది కూడా అందరిలో క్యూరియాసిటీ పెంచే అంశం.

7) ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఆమె పాత్ర ఈ సినిమాకి బాగా కీలకమట.

8) వెంకటేష్ అలాగే అతని మేనల్లుడు నాగ చైతన్య లతో ‘వెంకీ మామ’ తీసిన నిర్మాతలు.. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారు ‘బ్రో’ ని రూపొందించారు. ఇందులో కూడా పవన్ కళ్యాణ్.. అతని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా నటించడం విశేషం. టీజర్, ట్రైలర్ చూస్తే మేకర్స్ కాంప్రమైజ్ కాకుండా ‘బ్రో’ ని రూపొందించినట్టు స్పష్టమవుతుంది.

9) బ్రహ్మానందం కూడా ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ రోల్ చేశారు. కాబట్టి.. సినిమాలో అదొక ఆసక్తికర అంశం అని చెప్పొచ్చు.

10) సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట. పవన్ సినిమా అనేసరికి అతను ఇంకా యాక్టివ్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తాడు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus