BRO Review in Telugu: బ్రో సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • పవన్ కళ్యాణ్, సాయితేజ్ (Hero)
  • కేతిక శర్మ, (Heroine)
  • రోహిణి , ప్రియప్రకాశ్ వారియర్ తదితరులు.. (Cast)
  • సముద్రఖని (Director)
  • టి.జి.విశ్వప్రసాద్ - వివేక్ కూచిబొట్ల (Producer)
  • తమన్.ఎస్ (Music)
  • సుజిత్ వాసుదేవన్ (Cinematography)
  • Release Date : జులై 28, 2023

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సాయితేజ్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “బ్రో”. తమిళంలో ఒటీటీలో విడుదలైన “వినోదాయ శీతం”కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే-మాటలు సమకూర్చారు. పవన్ కళ్యాణ్ రెగ్యులర్ సినిమాలకి వచ్చే క్రేజ్ ఈ చిత్రానికి రాకపోయినప్పటికీ.. ఎలాంటి నెగిటివిటీ & కాంట్రవర్సీలు లేకుండా విడుదలవుతుండడమే విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ సినిమా పవన్ అభిమానులను, సినిమా వీక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: టిఫిన్ తినడానికి, అమ్మతో ప్రేమగా మాట్లాడడానికి, చెల్లెలి ముఖం చూడడానికి కూడా టైమ్ లేదు అంటూ.. ఎప్పుడూ కాళ్ళకు చక్రాలు తగిలించుకొని తిరిగే మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయితేజ్), ఊహించని విధంగా ఒక కారు యాక్సిడెంట్లో మరణిస్తాడు. ఆత్మ పైలోకానికి చేరుకొనే లోపు.. ఎప్పుడూ లేదనుకుంటూ గడిపిన టైమ్ అలియాస్ టైటాన్ (పవన్ కళ్యాణ్) ఎదురవుతాడు.

తనకు కొంచెం సమయం కావాలని, తాను సెటిల్ చేయాల్సినవి చాలా ఉన్నాయని వేడుకొని.. టైటాన్ దగ్గర 90 రోజుల గడువు తీసుకొని, తోడుగా అతడ్ని కూడా తీసుకొని మళ్ళీ బ్రతికొస్తాడు. మార్క్ వేడుకొని మరీ తెచ్చుకొన్న 90 రోజుల సమయం అతడికి ఏం నేర్పింది? అనేది “బ్రో” సినిమా చూసి తెలుసుకోవాల్సిన సినిమా.

నటీనటుల పనితీరు: పవన్ కళ్యాణ్ గత కొన్ని సినిమాల్లో మిస్సైన స్టైల్ & ఎనర్జీ “బ్రో” సినిమాలో పుష్కలంగా కనిపించాయి. కాకపోతే.. పవన్ కళ్యాణ్ పాత సినిమాల్లోని హిట్ పాటలకి మళ్ళీ పవన్ కళ్యాణ్ తోనే డ్యాన్సులు చేయించడం అనేది మాత్రం అనుకున్నంతగా వర్కవుతవ్వలేదు. ఒకట్రెండు సార్లంటే పర్లేదేమో కానీ.. సినిమా మొత్తంగా ఒక అయిదారు సార్లు అదే పనిగా పాత పాటల్ని ఇరికించడం అనేది మైనస్ గా మారింది.

ఇక సాయిధరమ్ తేజ్ సినిమా షూటింగ్ టైమ్ కి యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకోలేదనే విషయం ప్రతి ఫ్రేములో కనిపిస్తూనే ఉంటుంది. అతడి స్క్రీన్ ప్రెజన్స్ & ఎనర్జీపై యాక్సిడెంట్ భారీ స్థాయిలో ఎఫెక్ట్ చూపించింది. కొన్ని చోట్ల డ్యాన్స్ చేయడానికి కూడా తేజ్ చాలా కష్టపడ్డాడు. వ్యక్తిగా అతడ్ని తప్పుపట్టడానికి లేకపోయినప్పటికీ.. నటుడిగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.

కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, రోహిణి, వెన్నెల కిషోర్, అలీ రెజా తమ తమ పాత్రల్లో పర్వాలేదనిపించుకున్నారు. సినిమా మొత్తం పవన్-తేజ్ లు కబళించేయడంతో.. ఇంకెవరికీ పెద్దగా ఛాన్స్ రాలేదనుకోండి.

సాంకేతికవర్గం పనితీరు: పవన్ కళ్యాణ్ లాంటి బడా స్టార్, 100 కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న కథానాయకుడ్ని పెట్టుకొని సినిమా తీస్తున్నప్పుడు.. అతడు ఎన్ని డేట్స్ ఇచ్చాడు అనే విషయాన్ని ప్రామాణికంగా కాకుండా.. సినిమా అవుట్ పుట్ ఎంత బాగా వచ్చింది అనేది చాలా ముఖ్యం. నిర్మాణ సంస్థగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ విషయంలో దారుణంగా విఫలమైంది. మరి సినిమాను అర్జెంట్ గా విడుదల చేయడం వెనుక కారణాలేమిటి అనేది తెలియదు కానీ..

ప్రోపర్ అవుట్ పుట్ లేని సినిమాను కంగారుగా విడుదల చేయడం మొదటి తప్పు, ఎంత గ్రీన్ స్క్రీన్ & వర్చువల్ షూట్ చేసినప్పటికీ.. సీజీ వర్క్ విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం రెండో తప్పు, ఇక సినినిమా కానీ, సినిమాకి సంబంచిందిన కంటెంట్ కానీ జనల్లోకి తీసుకొని వెళ్ళే సరైన స్థాయి ప్రమోషన్స్ చేయకుండా సినిమాను విడుదల చేయడం మూడో తప్పు. ఇలా తప్పు మీద తప్పు చేసి.. తమ 25వ చిత్రమైన “బ్రో”తో ఒక ప్రొడక్షన్ హౌస్ గా నెగిటివ్ వైబ్ దక్కించుకొంది.

త్రివిక్రమ్ మాటల్లో పదును రోజురోజుకీ తగ్గుతోంది. కథ లేదా సన్నివేశంలోని అర్ధం ఎలివేట్ చేయకుండా.. పంచ్ లు, ప్రాసల కోసం పడుతున్న ప్రయాసలో కంటెంట్ మిస్ అవుతుంది. ఈ విషయాన్ని ఆయన గుర్తించాలి. అలాగే.. వినోదాయ శీతం”కు స్క్రీన్ ప్లే విషయంలో ఆయన చేసిన మార్పులు బెడిసికొట్టాయి. దర్శకుడు సముద్రఖని.. తన మూలకథపై ఉంచిన నమ్మకాన్ని దర్శకత్వం విషయంలో కనబడనీయలేదు.

ముఖ్యంగా.. సినిమాకి చాలా ముఖ్యమైన ఎమోషన్స్ అస్సలు ఎక్కడా ఎలివేట్ అవ్వలేదు. సినిమాలో అమ్మ, చెల్లి, తమ్ముడు వంటి ఎమోషన్స్ పుష్కలంగా ఉన్నప్పటికీ.. అవేమీ సరిగా వినియోగించుకోలేకపోయాడు దర్శకుడు సముద్రఖని. ముఖ్యంగా.. క్యారెక్టర్ రియలైజేషన్స్ ను ఎక్కడా సరిగా చూపించలేదు. కానీ.. తమిళ వెర్షన్ లో మాత్రం క్యారెక్టర్ ఆర్క్స్ బాగుంటాయి. మరి స్టార్ హీరోతో అనేసరికి అనవసరమైన ఎలివేషన్స్ కోసం కథను అడ్డదిడ్డంగా మార్చేసరికి.. దర్శకుడిగా ఆయన మార్క్ ఎక్కడా కనిపించలేదు.

తమన్ ఒక్కడే సినిమాకి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. పాటలు సోసోగా ఉన్నప్పటికీ.. నేపధ్య సంగీతంతో మాత్రం ఆడియన్స్ కు మంచి హై ఇచ్చాడు. అయితే.. తమన్ పాటల కంటే.. మణిశర్మ, రమణ గోగుల పాటలు సినిమాలో ఎక్కువగా వినిపించడం మైనస్ అయ్యింది.

విశ్లేషణ: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే స్టఫ్ పుష్కలంగా ఉన్న సినిమా “బ్రో”. అయితే.. గ్రాఫిక్స్ వర్క్ & పూర్తిస్థాయిలో వర్కవుటవ్వని ఎలివేషన్స్ ను పక్కనపెట్టగలిగితే.. “బ్రో” చిత్రాన్ని ఫ్యాన్స్ వరకూ ఆస్వాదించగలరు!


రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus