అక్కినేని నాగార్జున హీరోగా ‘పిఎస్వి గరుడ వేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ఘోస్ట్’. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది.ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈరోజు మరో ట్రైలర్ ను కూడా విడుదల చేసి మరింత అంచనాలు పెంచారు మేకర్స్.నిజంగానే ఈ ట్రైలర్ అదిరిపోయింది.
విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఓ హాలీవుడ్ మూవీని చూసిన ఫీలింగ్ ను కలిగించాయి.ట్రైలర్ లాంచ్ అనంతరం మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పుకొచ్చారు నాగార్జున. ఈ క్రమంలో నాగార్జునకి ఓ ప్రశ్న ఎదురైంది. ‘ది ఘోస్ట్’ తర్వాత సినిమాలకి గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నారట నిజమేనా అంటూ నాగార్జునకి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి నాగార్జున ‘నిజమే’ అంటూ సమాధానం ఇచ్చాడు. ‘అయితే ఎక్కువ కాలం కాదు.
గత నాలుగైదు సంవత్సరాలుగా నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూనే ఉన్నాను. కొంచెం గ్యాప్ తీసుకోవాలి అనే ఆలోచన ఉంది. నెక్స్ట్ సినిమా ఓకే చేసేలోపు ఒక 2,3 నెలలు గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నాను’ అంటూ నాగార్జున ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు.నాగార్జున కాల్ షీట్ల కోసం చాలా మంది యంగ్ డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు.
అలాగే ఓ పక్క సినిమాలతో పాటు మరోపక్క ‘బిగ్ బాస్ 6’ ని కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. శని, ఆది వారాల్లో బుల్లితెర పై దర్శనమిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు నాగార్జున. ‘బిగ్ బాస్ 6’ కంప్లీట్ అవ్వడానికి మరో మూడు నెలల వరకు టైం పడుతుంది. అందుకే నాగార్జున ఇలా గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నట్టు ఉన్నారు.