జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఇతర రాజకీయ పార్టీ నేతలు కూడా విమర్శించని విధంగా సినీ క్రిటిక్ కత్తి మహేష్ విమర్శిస్తుంటారు. ఈ విషయంపై పవన్ ఎప్పుడూ మాట్లాడకపోయినా కత్తి మహేష్, పవన్ అభిమానుల మధ్య పెద్ద వార్ జరిగింది. టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో గొడవ కొనసాగింది. అయితే కొన్ని రోజుల క్రితం కత్తి మహేష్ రాజీకొచ్చి పవన్ ని విమర్శించడం ఆపేసారు. అయితే నిన్న పవన్ తన పార్టీ ఆఫీస్ కోసం భూమి పూజ చేయడంతో కత్తి మహేష్ ట్విట్టర్ వేదికపై తీవ్రంగా ఆరోపించారు. ‘‘జనసేన పార్టీ ఆరంభంలోనే బానిసత్వం ఉంది. పవన్ కల్యాణ్ రాజకీయ పంథాలోనే జీహుజూరి ఉంది. పార్టీ ఆఫీస్ నిర్మాణపు పునాదిలోనే అవినీతి ఉంది.
ఇది మార్పు కోసం వస్తున్న రాజకీయం కాదు.. ఏమార్చడానికి కొనసాగుతున్న పవనిజం’’ అంటూ కత్తి మహేష్ సంచలన ట్వీట్ చేశారు. దీనికి కొద్ది నిమిషాల్లోనే నగేష్ రీ ట్వీట్ చేశారు. ‘‘వినాశకాలే విపరీత ట్వీట్లు.. మిడిసిపాటుకు తప్పదు భంగపాటు. ఈ ఉన్మాదానికి పాడాలి చరమగీతం. వేలకోట్ల జగన్ అవినీతి కనిపించని వైసీపీ కత్తి మహేష్‌కి, జనసేన విషయంలో అవినీతి ఆధారం చూపిన మరుక్షణం నా ట్విట్టర్ ఎకౌంట్ డిలీట్ చేస్తా.. కత్తి అనుచరుడిగా మారిపోతా’’ అని ట్వీట్ తో కౌంటర్ ఇచ్చారు. పవన్ అభిమానులు కూడా కత్తి మహేష్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.