సౌత్ చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్ గా కంటే ఐటెం భామగా పేరుతెచ్చుకున్న రాయ్ లక్ష్మీ హిందీలో చేసిన మూవీ “జూలీ 2”. ఈ చిత్రం రేపు (శుక్రవారం) హిందీ తో పాటు తమిళ భాషలో ను విడుదలకానుంది. టీజర్ తో హీట్ పుట్టించిన ఈ మూవీ ఇప్పుడు నిర్మాత చేసిన కామెంట్ తో వార్తల్లో నిలిచింది. ఈ సినిమా నిర్మాత పహ్లజ్ నిహ్లాని మీడియా ముందు మాట్లాడుతూ “1990ల చివరలోని ఓ పాపులర్ హీరోయిన్ జీవితకథ ఆధారంగా మా చిత్రం రూపుదిద్దుకొంది. అయితే ఆమె పేరుని మాత్రం నేను చెప్పలేను. మరో ముఖ్యమైన విషయమేమిటంటే మా సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడితో కూడా ఆ హీరోయిన్‌కు అనుబంధముంది. ఆమె పేరు వెల్లడించడం వల్ల మా సినిమా ఆగిపోయే ప్రమాదం ఉంది. కనుక ఆ పని మాత్రం చేయలేను.
సినిమా చూసే ప్రతి ఒక్కరికీ రాయ్ లక్ష్మి పోషించిన రియల్ లైఫ్ హీరోయిన్ పాత్ర ఎవరిదో అర్థమై పోతుంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు అతను చెప్పిన క్లూ ప్రకారం నగ్మా జీవితం ఆధారంగా తెరకెక్కినట్లుగా సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. ఈ విషయం నగ్మా వద్దకు వెళ్ళింది. ఆమె ఈ రోజు స్పందించారు. “ఇప్పుడు ఏమి చేయాలో తెలియడం లేదు. ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదు. పబ్లిసిటీ కోసం చెబుతున్నారో, సినిమాలో ఉందో చూడాలి. సినిమా విడుదలయ్యాక చూసి మాట్లాడతాను” అని నగ్మా వివరించారు. మరి రేపు ఈ మూవీ ఎన్ని వివాదాలను రేపుతుందో చూడాలి.