బావ రమేష్ బాబు కూతురి గురించి నమ్రత పోస్ట్.. వైరల్ అవుతున్న ఫోటో..!

  • November 29, 2022 / 05:56 PM IST

సూపర్ స్టార్ కృష్ణ గారి మరణ వార్తను ఘట్టమనేని కుటుంబ సభ్యులు, వీరాభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన కృష్ణ గారి పెద్ద కర్మ కార్యక్రమంలో మహేష్ బాబు, సుధీర్ బాబు, కృష్ణ గారి తమ్ముడు ఆదిశేష గిరి రావు ఎమోషనల్ అవడంతో అభిమానులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు ఫ్యామిలీ గురించి చాలా మందికి పెద్దగా తెలియదు కానీ కృష్ణ గారి చిన్న కర్మ అప్పుడు వదిన మృదుల, అన్నయ్య పిల్లలు భారతి, జయకృష్ణలతో మహేష్ కలిసున్న పిక్స్ సోషల్ మీడియాలో కనిపించినప్పుడే తెలిసింది.

మహేష్ భార్య నమ్రత రీసెంట్‌గా బావ గారి కుమార్తె భారతి గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘ఈ ఇద్దరమ్మాయిల వల్ల ఇంట్లో నవ్వులొచ్చాయి’’ అంటూ భారతి. సితారలతో కలిసి తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు నమ్రత. బావ రమేష్ బాబు కూతురి గురించి మహేష్ వైఫ్ ఫస్ట్ టైం పోస్ట్ చేయడంతో ఈ ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ‘ సితార, భారతి ఇద్దరూ మహాలక్ష్మీలా ముచ్చటగా ఉన్నారు’ అంటూ మహేష్ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus