టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత అందగాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హాలీవుడ్ హీరోలకు సైతం పోటీ ఇచ్చేలా ఉంటుంది ఆయన గ్లామర్. వయసు పెరిగే కొద్దీ ఆయన గ్లామర్ మరింతగా పెరుగుతూనే ఉంది.ఇది పక్కనపెడితే ఆయన మీసంతో కనిపించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ‘టక్కరి దొంగ’ ‘మహర్షి’ వంటి సినిమాల్లో కొంచెం గడ్డంతో అలాగే మీసంతో కనిపిస్తాడు. మధ్యలో వచ్చిన ‘భరత్ అనే నేను’ చిత్రంలో కూడా మీసంతో కనిపించాడు.
మళ్ళీ ఈ మధ్య టీవీల్లో టెలికాస్ట్ అయిన ఫ్లిప్ కార్ట్ యాడ్ లో మీసంతో అలాగే పంచెకట్టుతో కనిపించి ఆశ్చర్యపరిచాడు మహేష్. మహేష్ కొత్త లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ కృత్రిమంగానే మీసంతో కనిపించాడని చాలా మందికి తెలుసు. అయితే ఆ లుక్ మాత్రం మహేష్ కు బాగానే ఒప్పింది. మీసంతో కనిపించడానికి మహేష్ పడిన కష్టాలను ఆయన భార్య నమ్రత తెలియజేస్తూ.. ఓ ఫోటోని షేర్ చేసింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఈ ఫోటోని షేర్ చేస్తూ..
“ఆర్టిఫిషియల్ గా అమర్చేవి … జెన్యూన్ గా అనిపించవు. కానీ షూటింగ్ కోసం కొన్ని ఆర్టిఫిషియల్ పద్దతులను పాటించాల్సి వస్తుంటుంది. అది అంత ఈజీ కాదు కానీ… వాటిని మేనేజ్ చేసే నిపుణులు ఉన్నప్పుడు అలాంటి ఛాలెంజెస్ ను ఇష్టపడనివారుండరు’ అంటూ పేర్కొంది నమ్రత.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?