Balakrishna: బాలయ్య లైనప్ మాములుగా లేదుగా!

  • January 17, 2023 / 10:58 AM IST

నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. ‘అఖండ’తో హిట్ కొట్టిన ఆయన రీసెంట్ గా ‘వీర సింహారెడ్డి’ సినిమాతో మరో హిట్టు సినిమా తన ఖాతాలో వేసుకున్నారు. కెరీర్ పరంగా బాలయ్య పీక్ స్టేజ్ లో ఉన్నారు. దానికి తగ్గట్లే వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఆయన కూతురిగా శ్రీలీల కనిపించనుంది.

ఈ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు తెరపై బాలయ్య చూడని విధంగా ఈ సినిమాలో చూపిస్తారట. సీరియస్ కాన్సెప్ట్ తో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాతో పాటు బోయపాటి శ్రీను సినిమా లైన్ లో ఉంది. అది ‘అఖండ’ సినిమాకి సీక్వెలా..? లేక కొత్త కథ..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. ఈ రెండు సినిమాలే కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టారు బాలయ్య అందులో ఒకటి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఉంటుంది.

‘అన్ స్టాపబుల్’ యాడ్ ను షూట్ చేసిన సమయంలోనే అతడితో కలిసి సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు బాలయ్య. దీన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. అలానే ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట్ తో కలిసి మరో సినిమా చేయనున్నారు బాలయ్య. ఈ సినిమాను గీతాఆర్ట్స్ సంస్థ నిర్మించనుంది. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో హిట్టు కొట్టిన దర్శకుడు బాబీ.. బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్నారు.

ఒక మాస్ ఎంటర్టైనర్ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ సినిమాలన్నీ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే. మొత్తానికి బాలయ్య తన సినిమాల లైనప్ తో యంగ్ హీరోలకు సైతం పోటీనిస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus