Balayya Babu: అనిల్ రావిపూడికి బాలయ్య ఫ్యాన్స్ సూచనలివే!

  • May 27, 2022 / 12:07 PM IST

సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలు అంటే యాక్షన్ సన్నివేశాలు ఉన్నా కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈతరం దర్శకులలో కామెడీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి అని చెప్పవచ్చు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్3 నేడు థియేటర్లలో రిలీజ్ కానుండగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ తో రివ్యూలు వస్తుండటం గమనార్హం. ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయింది.

అయితే ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలు ఎక్కువగా ఉండవని ఎఫ్3 ప్రమోషన్స్ లో భాగంగా అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. అయితే తెలుగులో నవరసాలను అద్భుతంగా పండించే హీరోలలో బాలకృష్ణ ఒకరు. బాలయ్య కామెడీ టైమింగ్ కు చాలా సినిమాలలో పాజిటివ్ మార్కులు పడ్డాయి. అనిల్ రావిపూడి కూడా బాలయ్యలోని టైమింగ్ ను వాడుకుంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య ఫ్యాన్స్ సూచనలను పరిగణనలోకి తీసుకొని తన మార్క్ కామెడీ ఉండే విధంగా జాగ్రత్త పడితే మంచిది.

అనిల్ రావిపూడి బాలకృష్ణను కొత్తగా చూపించాలని బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెల నుంచి మొదలుకానుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా మాత్రం దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కడం లేదు. కళ్యాణ్ రామ్ కు పటాస్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి బాలయ్యకు అంతకు మించిన బ్లాక్ బస్టర్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కీలక నటీనటుల ఎంపిక ప్రక్రియ పూర్తైందని సమాచారం అందుతోంది. బాలయ్య అనిల్ రావిపూడి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది. ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus