ఐతే, అనుకోకుండా ఒక రోజు, మనమంతా వంటి విభిన్నమైన కథలతో విజయాలను అందుకున్న చంద్రశేఖర్ యేలేటి మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అద్భుతమైన కథ రెడీ చేసుకొని నాని కి వినిపించడం.. అతను ఒకే చెప్పడం జరిగిపోయాయి. అయితే నాని ఇప్పుడు నాగార్జునతో కలిసి దేవదాస్ అనే మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత “మళ్ళీ రావా” చిత్ర డైరెక్టర్ గౌతమ్ తెరకెక్కించే “జెర్సీ” చిత్రంలో నటిచనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత చంద్ర శేఖర్ యేలేటి ప్రాజక్ట్ పట్టాలెక్కనుంది. ఇందులో అనుష్క హీరోయిన్ గా నటిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాపై ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఈ కథని ముగ్గురు రిజెక్ట్ చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. చంద్రశేఖర్ యేలేటి ఈ కథని ముందుగా గోపీచంద్‌కు వినిపించాడట.
కథ విని వెంటనే ఒకే చెప్పినా.. తన కెరీర్ లో ఫ్లాప్ లు ఎక్కువగా ఉన్నాయని మళ్ళీ సాహసం చేయడం ఇష్టంలేక నో చెప్పారు. గోపీచంద్ తర్వాత ఆ కథ సాయిధరమ్ తేజ్ వద్దకు వెళ్ళింది. వరుసగా ఐదు సినిమాలు ప్లాప్ అవడంతో తేజ్ ఈ చిత్రాన్ని చేయడానికి వెనకడుగు వేశారు. నితిన్‌కు సూట్ అవుతుందని అతని చెప్పాడట. కథ విన్న నితిన్ చూద్దాం.. చేద్దాం అంటున్నారే గానే పక్కాగా చెప్పలేదంట. చివరగా నాని ని కలిసి చెప్పగానే మొదటి సిట్టింగ్ లోనే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మరి వారు ముగ్గురు తీసుకున్న నిర్ణయం మంచిదో.. నాని నిర్ణయం మంచిదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.