శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపిన నాని

  • June 11, 2018 / 01:46 PM IST

గత కొన్ని రోజులుగా నాని మీద శ్రీరెడ్డి అలియాస్ విమల అలియాస్ శ్రీశక్తి అలియాస్ చాలా ఉన్నాయనుకోండి డైరెక్ట్ & ఇండైరెక్ట్ ట్వీట్స్ & పోస్ట్స్ ద్వారా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ నాని ఈ విషయమై ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు సరికదా కనీసం పట్టించుకోలేదు. నాని పట్టించుకోకపోవడం వల్లనో లేక తనని ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదనే మెంటల్ డిప్రెషన్ వల్లనో తెలియదు కానీ.. అసలే అధఃపాతాళానికి దిగజారిన శ్రీరెడ్డి ఇంకాస్త కిందకి దూకి, దొర్లి మరీ ఇంకా దారుణమైన కామెంట్స్ చేసింది. దాంతో నాని రంగంలోకి దిగాల్సి వచ్చింది. “ఓపికకు కూడా ఒక లిమిట్ ఉంటుంది” అని తాను శ్రీరెడ్డి విషయంలో ఎందుకు రియాక్ట్ కాదలుచుకోలేదు అనే విషయంతోపాటు.. క్లిక్స్ & వ్యూస్ కోసం సదరు సెన్స్ లెస్ న్యూస్ పబ్లిష్ చేస్తున్న మీడియా హౌసెస్ మీద కూడా ఫైర్ అయ్యాడు నాని.

శ్రీరెడ్డికి “బిగ్ బాస్ 2″లో పాల్గొనే అవకాశం వచ్చినప్పటికీ.. నాని ఆమె అవకాశాన్ని కాళరాశాడని, ఆమె ఉంటే షో కనీసం హోస్ట్ కూడా చేయనన్నాడని కథనాలు రావడంతో ఈ గొడవ మొత్తం రైజ్ అయ్యింది. రైజ్ అని గొడవను సదరు శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి సిగ్గులేకుండా పోస్ట్ చేసిన బూటకపు కథనాల వలన ఆ రచ్చ కాస్త చండాలంగా రూపాంతరం చెందింది. మరి ఇప్పుడు నాని లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాడు కాబట్టి ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందో.. లేక మెంటల్లీ డిస్టర్బడ్ శ్రీరెడ్డి ఇంకా పేట్రేగిపోయి ఈ రచ్చని ఇంకాస్త పెద్దది చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus