అఖిల్ కోసం తన సినిమా రిలీజ్ డేట్ మార్చిన నాని!

  • October 28, 2017 / 11:52 AM IST

అఖిల్, నాని .. విజయం కోసం ఎదురుచూస్తున్న హీరో ఒకరు.. వరుసగా హిట్స్ అందుకుంటున్న హీరో మరొకరు. వీరిద్దరి సినిమాలు వార్ కి దిగడానికి సిద్ధమయ్యాయి. ఆ యుద్ధం ఇద్దరికీ మంచికాదని భావించిన నాని.. అఖిల్ కి సైడ్ ఇచ్చారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రొమాంటిక్ థ్రిల్లర్ హలో సినిమాని చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ లో రిలీజ్ కావడానికి ముస్తాబు అవుతోంది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 21న విడుద‌ల చేయాల‌ని నాగ్ డిసైడ్ అయ్యారు. అయితే అదే రోజు  వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో నాని చేస్తున్న “ఎమ్‌సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)” చిత్రాన్ని రిలీజ్ చేయాలని దిల్ రాజు అనుకున్నారు.

అయితే అదే రోజు హలో రావడం ఫిక్స్ అయిపోవడంతో ఎమ్‌సీఏ రిలీజ్ డేట్ ని మార్చుకున్నారు. అనుకున్న తేదీ కన్నా ఒక వారం ముందుగానే అంటే డిసెంబ‌ర్ 15న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని దిల్ రాజు డిసైడ్ అయ్యారు. ఈ రెండూ యువత హృదయాలను దోచుకుంటాని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus