Nani: ఆ ఛానెల్ లో న్యాచురల్ స్టార్ ను అవమానించారట.. చివరకు ఏమైందంటే?

న్యాచురల్ స్టార్ నాని తెలుగులో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నానిని అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నాని రెమ్యునరేషన్ 15 నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సోషల్ మీడియాలో కూడా నానికి క్రేజ్ పెరుగుతోంది. దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నాని హాయ్ నాన్న సినిమాతో మరో భారీ సక్సెస్ ను అందుకుంటాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

అయితే కెరీర్ తొలినాళ్లలో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సమయంలో ఒక క్యాసెట్ ఇవ్వడం కోసం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కు వెళ్లాడట. అయితే అక్కడ ఈ క్యాసెట్ తీసుకోవాల్సిన వ్యక్తి మాత్రం నానిని ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయించాడట. ఆ సమయంలో నాని బాగా హర్ట్ అయినా ఆయనను మాత్రం ఏమీ అనకుండా క్యాసెట్ ఇచ్చి వచ్చేశాడట.

ఆ తర్వాత అదే ఛానల్ కు న్యాచురల్ స్టార్ నాని తన సినిమా విడుదలైన తర్వాత వెళ్లగా ఎవరైతే వెయిట్ చేయించి అవమానించారో ఆ వ్యక్తి నానిని సత్కరించారు. ఆ సమయంలో నాని ఒకింత గర్వంగా ఫీలయ్యారట. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన నాని అంచెలంచెలుగా ఎదిగి కెరీర్ పరంగా సక్సెస్ అయ్యారు. ఎంతోమంది కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ నాని ప్రశంసలను అందుకుంటున్నారు.

న్యాచురల్ స్టార్ నాని సినిమాల బడ్జెట్లు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించి సత్తా చాటాలని నాని భావిస్తుండగా నాని ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. నాని తాజాగా భారీ మల్టీస్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. నాని రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సక్సెస్ లను అందుకుంటారేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags