ఆకట్టుకున్న నాని కొత్త చిత్రం ఫస్ట్ లుక్
- February 23, 2017 / 12:06 PM ISTByFilmy Focus
నేచురల్ స్టార్ నాని ఎంచుకునే కథలు చాలా నేచురల్ గా ఉంటాయని మరో మారు నిరూపించారు. నూతన దర్శకుడు శివ నిర్వాన డైరెక్షన్లో ఆయన సినిమా చేస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ వంటి ఆకర్షణీయమైన లోకేషన్లలోచిత్రీకరణ జరుపుకుంటోంది. మార్చి వరకు అక్కడే షెడ్యూల్ కొనసాగుంది. ఈ నెల 24న నాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా నాని అభిమానులకోసం ఈ రోజు బర్త్ డే గిఫ్ట్ గా తన సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీంతో టైటిల్ కూడా రివీల్ అయింది.
“నిన్ను కోరి” అనే టైటిల్ తో ఉన్న పోస్టర్ యూత్ ని ఆకట్టుకుంది. తన స్టైల్లో నవ్వుతూ అందర్నీ ఇంప్రెస్స్ చేసాడు. జెంటిల్ మ్యాన్ సినిమాలో నాని తో పోటీ పడి నటించి మంచి మార్కులు కొట్టేసిన నివేత థామస్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని జులై లో రిలీజ్ చేయాలనీ నిర్మాత భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














