నాని ‘ఎస్.ఆర్.హెచ్’ టీంలో ఆడాలి : విజయ్ దేవరకొండ

  • April 23, 2019 / 12:20 PM IST

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం ‘జెర్సీ’. ఏప్రిల్ 19 న విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ చిత్రం అద్భుతమంటూ ఎన్టీఆర్,బన్నీ,రాజమౌళి,దిల్ రాజు వంటి ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో నాని నటన కూడా అద్భుతమంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక తాజాగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రం పై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు. సన్ రైజర్స్ టీం లో కూడా నాని ఆడాలంటూ పంచులు వేసాడు. దీనికి నాని కూడా ఫన్నీ కౌంటర్ వేసాడు.

విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ద్వారా ‘జెర్సీ’ చిత్రం పై స్పందిస్తూ… ” ‘జెర్సీ’ చిత్రం చూస్తున్నంత సేపు ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. నిజంగా సినిమా చూసాక మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టాను. ముఖ్యంగా అర్జున్ నటన అస్సలు చూస్తున్నప్పుడు సీట్ నుండీ కదల్లేదు. ‘నాని… ఫుల్ లవ్ టు యు’. గౌతమ్ నీ డైరెక్షన్లో చేయాలని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాను… నీ దగ్గర మంచి కథలున్నాయని ఆశిస్తున్నాను.” అంటూ ట్వీట్ చేస్తూ మరో పక్క గమనిక : ‘ఎస్.ఆర్.హెచ్’ టీం కు నాని ఆడాలని కోరుకుంటున్నాను. ఏమి స్ట్రైకింగ్… ఏమి స్ట్రైకింగ్” అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి నాని బదులిస్తూ… “రిషి… అర్జున్ అనేవాడు క్రికెటర్ … నాని కి సినిమాలే…ఆ పనిలో ఉందాం” అంటూ సరదాగా కౌంటరిచ్చాడు. స్వతహాగా నాని, విజయ్ మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే… ఇద్దరూ కలిసి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో కలిసి నటించారు కూడా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus