మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నంలో బిజీగా ఉంటే.. మధ్యలో నాని వచ్చాడేంటి అనే ప్రశ్న మీకు రావడం సహజమే. ఎందుకంటే ఏప్రిల్ 3 నుంచి పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే నాని సినిమా విష్యం లోకి వెళితే.. దర్శకత్వంలో బిజీగా ఉంటూనే త్రివిక్రమ్ తక్కువ బడ్జెట్ సినిమాలను నిర్మించాలని ఆలోచిస్తున్నారు. తొలిగా నేచురల్ స్టార్ నాని తో సినిమా తీయాలని అనుకున్నారు. అందులో భాగంగా డైరక్టర్ ని వెతుకుతుంటే అవసరాల శ్రీనివాస్ కనెక్ట్ అయ్యారు. రీసెంట్ గా శ్రీని చెప్పిన కథ త్రివిక్రమ్ కి బాగా నచ్చిందంట.
తాను రాసుకున్నదానికంటే బాగుండడంతో వెంటనే ఒకే చెప్పారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా నానికి అవసరాలకి మధ్య మంచి స్నేహం ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని భావించి సెట్స్ మీదకు తీసుకుపొమ్మని త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో డైరక్టర్ శ్రీని మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం నాని నిన్ను కోరి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే అవసరాల శ్రీనివాస్ డైరక్షన్లో నటించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.