సమ్మర్ సినిమాల పాలిట శాపంగా మారిన ఎలక్షన్ షెడ్యూల్

  • March 12, 2019 / 06:48 PM IST

సరిగ్గా వారం రోజుల క్రితమే నాని “జెర్సీ”, సాయిధరమ్ తేజ్ “చిత్రలహరి”, నాగచైతన్య “మజిలీ” చిత్రాలు రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేశాయి. సమ్మర్ లో వారానికొక సినిమా చూడొచ్చు అని మూవీ లవర్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈలోపు సడన్ గా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. దాంతో ప్రస్తుతానికి మార్పు లేకపోయినా త్వరలోనే భారీస్థాయిలో విడుదల తేదీల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశం పుష్కలంగా ఉందని తెలుస్తోంది.

ఏప్రిల్ 12న విడుదలవ్వాల్సిన సాయిధరమ్ తేజ్ “చిత్రలహరి” సరిగ్గా ఎలక్షన్స్ అయిన సెకండ్ డే విడుదలవుతుంది. ఒకరకంగా చూసుకుంటే ఎలక్షన్ హల్ చల్ తో బోర్ కొట్టేసిన జనాలు హ్యాపీగా సినిమాకి వెళ్తారు. కానీ.. ఇంకో యాంగిల్లో.. ఎవరు గెలుస్తారు? అనే టెన్షన్ లో ఎగ్జిట్ పోల్స్ తో హడావుడిగా ఉంటారు. ఇక ఆ తర్వాత సరిగ్గా రిజల్ట్స్ టైమ్ లో విడుదలకు సిద్ధమవుతున్న “జెర్సీ, మజిలీ” చిత్రాలు కూడా తమ విడుదల తేదీలను మార్చుకొనే అవకాశం ఉంది. మరి కొత్త తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus