Dasara: నాని ‘దసరా’ కోసం భారీస్థాయిలో చేతులు మారుతున్న థియేట్రికల్ రైట్స్..

  • February 3, 2023 / 11:18 AM IST

కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ కాన్సెప్ట్స్, వెరైటీ క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్ నాని.. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ మీద విభిన్న తరహా చిత్రాలు తెరకెక్కిస్తూ ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గానూ మారాడు. నాని, కీర్తి సురేష్ జంటగా.. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘దసరా’.. ‘నేను లోకల్’ తర్వాత నాని, కీర్తి కలిసి నటిస్తున్న సినిమా ఇది.

అలాగే నాని కెరీర్‌లో రూపొందుతున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం కూడా ఇదే కావడం విశేషం.. రీసెంట్‌గా ఐదు భాషల్లో ఐదుగురు స్టార్స్ ‘దసరా’ టీజర్ రిలీజ్ చేశారు. దర్శకధీరుడు రాజమౌళి (తెలుగు), షాహిద్ కపూర్ (హిందీ), ధనుష్ (తమిళ్), రక్షిత్ శెట్టి (కన్నడ), దుల్కర్ సల్మాన్ (మలయాళం) టీజర్స్ రిలీజ్ చేశారు. టీజర్ విషయానికొస్తే.. ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలినప్పటి నుండే కంప్లీట్ ఊరమాస్ గెటప్‌లో, డీ గ్లామర్‌గా కనిపిస్తూ.. డిఫరెంట్ మేకోవర్‌తో ఆకట్టుకోబోతున్నాడనిపించాడు నాని..

ఇక తెలంగాణ యాసలో పలికిన మాటలు హైలెట్ అయ్యాయి. ‘మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం’ అంటూ అలరించాడు. తోట శ్రీనివాస్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. సత్యన్ సూర్యన్ విజువల్స్, సంతోష్ నారయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యాయి. మొత్తం టీజర్ అంతా నానినే చూపించి.. ఇది నేచురల్ స్టార్ వన్ మెన్ షో అని హింట్ ఇచ్చారు.ఇక టీజర్‌తోనే భారీ అంచనాలు పెంచేసిన నాని ‘దసరా’ కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడడం అనేది పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

ముందుగా డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనుకున్న చదలవాడ నుంచి దిల్ రాజు నాలుగు కోట్లు అదనంగా ఇచ్చి కొనుక్కోగా, ఇప్పుడు దిల్ రాజు నుంచి ఏరియాల వారి హక్కులు కొనుకోడానికి వివిధ డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నారు. గతేడాది తెలుగు నుండి ‘ఆర్ఆర్ఆర్’, కన్నడ నుండి ‘కాంతార’.. ఈ ఏడాది ‘దసరా’ వస్తుంది అంటూ అంచనాలు పెంచేశాడు నేచురల్ స్టార్..

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus