సోలో హీరో నారా రోహిత్ విభిన్నమైన కథలతో ప్రతినిధి, అసుర వంటి సినిమాలు చేసి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ హీరో కొంతకాలంగా స్టోరీలపై చూపిస్తున్న శ్రద్ధ తన బాడీ పై చూపించలేదు. దీంతో బొద్దుగా తయారయ్యారు. జ్యో అచ్యుతానంద సినిమాలో అయితే లావుగా కనిపించారు. కమర్షియల్ హీరో లుక్ ని పూర్తిగా కోల్పోయారు. త్వరలో రిలీజ్ కానున్న అప్పట్లో ఒకడుండేవాడు మూవీలో కూడా లావుగానే ఉన్నారు.
ఇక బాడీ తన కంట్రోల్ తప్పుతుందనుకున్నారేమో ఇప్పుడు బరువు తగ్గే పనిలో పడ్డారు నారా రోహిత్. బరువు తగ్గడమే కాదు సిక్స్ ప్యాక్ రప్పించాలనే సంకల్పంతో జిమ్ లో అడుగు పెట్టారు. ఆయన జిమ్ లో వ్యాయామం చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్లో విహారం చేస్తున్నాయి. ప్రస్తుతం నారా రోహిత్ “కథలో రాజకుమారి” సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత భీముడు మూవీ చేయనున్నారు. ఈ రెండు చిత్రాల్లో రోహిత్ ని నయా లుక్ లో చూడడం ఖాయం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.