టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణమైన కథలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో నారా రోహిత్ ఒకరు. నారా రోహిత్ (Nara Rohith) నటించిన ప్రతినిధి2 (Prathinidhi 2) ఈ నెల 10వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ను మార్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ ఫండింగ్ తో నారా రోహిత్ హీరో అయ్యాడనే విమర్శల గురించి ఆయన స్పందిస్తూ పెదనాన్న సీఎంగా ఉన్న సమయంలో నేను నటించిన సినిమాలు అన్నీ చెత్త సినిమాలు అని అన్నారు. పెదనాన్న సీఎం కాకముందే మంచి సినిమాలు చేశానని నారా రోహిత్ కామెంట్లు చేశారు. ఫండింగ్ తో సినిమాలు చేసే అవకాశం ఉంటే కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వనని నారా రోహిత్ పేర్కొన్నారు.
ఆ డబ్బులను జక్కన్నలాంటి (S. S. Rajamouli) స్టార్ డైరెక్టర్ల కోసం ఉపయోగించి ఆ డైరెక్టర్ డైరెక్షన్ లోనే నటించేవాడినని ఆయన పేర్కొన్నారు. మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతోనే బ్రేక్ తీసుకుని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చానని నారా రోహిత్ వెల్లడించారు. నెగిటివ్ కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. నారా రోహిత్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సరిగ్గా ఎన్నికల సమయంలో విడుదలవుతున్న ప్రతినిధి2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఎన్నికల ముందే రిలీజ్ అవుతుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. సెన్సార్ ఇబ్బందుల వల్ల ఈ సినిమా గత నెలలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడింది. ప్రతినిధి2 ఈసారి అయినా ఏ ఆటంకాలు లేకుండా విడుదల అవుతుందేమో చూడాలి. ప్రతినిధి2 సినిమా బిజినెస్ లెక్కల గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజుల వరకు ఆగాల్సిందే.