Narappa Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘నారప్ప’.. ఓటిటికే ఓటు..!

  • June 29, 2021 / 08:41 PM IST

విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా ‘సురేష్ ప్రొడక్షన్స్’, ‘వి క్రియేషన్స్’ బ్యానర్ల పై సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న చిత్రం `నారప్ప`. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మొదటి నుండీ మంచి అంచనాలే నెలకొన్నాయి. ఎప్పుడూ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు మాత్రమే తెరకెక్కించే దర్శకుడు.. ఓ భారీ యాక్షన్ మూవీ.. అది కూడా తమిళంలో సూపర్ హిట్ అయినటువంటి ‘అసురన్’ వంటి చిత్రాన్ని రీమేక్ చేస్తుండడంతో మొదటినుండీ మంచి అంచనాలే నెలకొన్నాయి.

విడుదల చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుంది. ‘నారప్ప’ కి సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు.వయొలెన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో సెన్సార్ వారు యు/ఎ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. జూలై 24న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు కూడా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ మధ్యనే థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తారని అంతా అనుకుంటున్నారు.

కానీ ఎక్కువ శాతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదలయ్యే అవకాశం ఉందట. ఆల్రెడీ రూ.35 కోట్లు ఫ్యాన్సీ రేటు చెల్లించి అమెజాన్ వారు డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. థియేట్రికల్ రిలీజ్ అయితే.. ఓటిటి వారు అంత రేటు చెల్లించరు కదా.. కాబట్టి ఎక్కువ శాతం ఈ చిత్రం ఓటిటిలోనే విడుదలవుతుంది అని తెలుస్తుంది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus