Amardeep Wife: అమర్ దీప్ భార్య కష్టాలను వెల్లడించిన నరేష్ లొల్ల. ఆ అకౌంట్లు క్లోజ్ అంటూ?

సీరియళ్ల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో అమర్ దీప్ ఒకరు. బిగ్ బాస్ షో ద్వారా అమర్ దీప్ పాపులారిటీని పెంచుకోగా అమర్ దీప్ బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అమర్ దీప్ వేర్వేరు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. నటుడు నరేష్ లొల్ల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమర్ దీప్ భార్య ఫోటోలను మార్ఫింగ్ చేశారంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.

అమర్ దీప్ భార్య కష్టాలను నరేష్ లొల్ల వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమర్ దీప్ ను, అతని కుటుంబాన్ని ట్రోల్ చేస్తున్నారని ట్రోల్స్ చేసిన వాళ్లపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయడంతో పాటు 300 అకౌంట్లను నేను క్లోజ్ చేయించానని నరేష్ లొల్ల అన్నారు. నేను అబ్బాయిని కాబట్టి పోరాడుతున్నానని ఆయన తెలిపారు. అమర్ ను సపోర్ట్ చేస్తూ అమ్మాయి పోస్ట్ పెట్టగా దారుణంగా కామెంట్లు చేశారని నరేష్ లొల్ల తెలిపారు.

బిగ్ బాస్ షో వల్ల తేజస్విని పడిన స్థాయిలో ఎవరూ ఇబ్బందులు పడలేదని తేజస్విని ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలను ఆమెకే ట్యాగ్ చేశారని నరేష్ లొల్ల వెల్లడించడం గమనార్హం. తేజస్విని తన బాధను ఎవరికీ చెప్పుకోలేదని తేజస్విని నరకం చూసిందని నరేష్ లొల్ల అన్నారు.

యూట్యూబ్ లో (Amardeep) అమర్ కు సపోర్ట్ చేస్తూ తేజస్విని వీడియో చేయాలంటే భయపడే విధంగా ట్రోల్స్ చేశారని నరేష్ లొల్ల కామెంట్లు చేయడం గమనార్హం. పోటీ అనేది టార్చర్ చేసేలా ఉండకూడదని నరేష్ లొల్ల అన్నారు. నరేష్ లొల్ల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus