నరేష్, పవిత్ర ల వ్యవహారం ఈ మధ్య కాస్త సైలెంట్ అయినట్టు కనిపించింది. మొన్నటి వరకు వీళ్ళు ఎక్కడా కలిసి కనిపించింది లేదు. అయితే మళ్ళీ వీళ్ళు ఒక వీడియో రూపంలో దర్శనమిచ్చారు. అందుకు కమెడియన్ అలీ కారణమని చెప్పాలి. అతను ఓ నిర్మాతగా రూపొందించిన మూవీ ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. ఈ చిత్రంలో అలీ హీరోగా నటించగా నరేష్, పవిత్రా లోకేష్ లు భార్యాభర్తలుగా కనిపించారు. ఈ మూవీలో వీరి మధ్య లవ్ సీన్స్ కూడా ఓ రేంజ్లో ఉన్నాయని వినికిడి.
ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీలో అక్టోబర్ 28 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో అలీ హీరోగా నటించినా కథ మొత్తం నరేష్, పవిత్ర ల చుట్టూనే తిరుగుతుందట. నిజజీవితంలో కూడా వీరు కలిసుంటున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళు మాత్రం మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నారు. బయట వీరి మధ్య ఉన్న ఆ బంధం వల్లే సినిమాలో వీరి మధ్య వచ్చే సన్నివేశాలు, లవ్ సీన్స్ బాగా పండాయని తెలుస్తుంది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘వికృతి’ చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ రూపొందింది. ఒరిజినల్ పెద్ద హిట్ అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. ఇక ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న సందర్భంగా, మరీ ముఖ్యంగా నరేష్, పవిత్ర ల నటనకు మంచి మార్కులు రావడంతో వీళ్ళు కలిసి ఓ వీడియో చేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. “సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని,సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా స్పందిస్తుండడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నరేష్ చెప్పుకొచ్చారు.
కంటెంట్ ఉన్న సినిమాలు సక్సెస్ అవుతాయని మరోసారి మా సినిమా నిరూపించిందని నరేష్ అన్నారు. అలాగే అందరూ బాగుండాలి, అందులో మేము నేను, పవిత్ర కూడా ఉండాలి అంటూ నరేష్ కామెంట్స్ చేశారు. ఈ వీడియోలో నరేష్ పవిత్ర పై చేతులు వేసి మాట్లాడటం కూడా హైలెట్ అయ్యిందని చెప్పొచ్చు.