మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు ఎంతటి వివాదాన్ని సృష్టిస్తున్నాయో తెలిసిందే. అధ్యక్ష పదవి రేసులో ఇప్పటికే ఐదుగురు బరిలో దిగారు. ఇందులో ముఖ్యంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య పోటీ ఉండేట్లు కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ముందుకు వెళ్తుంటే.. మంచు విష్ణు కోసం నరేష్ తెరవెనుక నుండి కథ నడిపిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి ఉండే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇక ఈ అధ్యక్ష పదవికి సీవీఎల్ నరసింహారావు కూడా బరిలో దిగడంతో తెలంగాణవాదం బలపడుతోంది. ఇంత గొడవ నడుస్తుంటే.. మురళీ మోహన్ ఏకగ్రీవానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఎన్నికలు ప్రకటించే వరకు తాను గానీ, తన ప్యానెల్ గానీ మీడియా ముందుకు రామని ప్రకాష్ రాజ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా మాత్రం ప్రకాష్ రాజ్ ఎన్నికలు ఎప్పుడు..? అంటూ తనదైన స్టైల్ లో ట్వీట్ పెట్టాడు.
ఆ ట్వీట్ కు సమాధానంగా నరేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ”ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మార్చిన నిబంధనల ప్రకారం ఎన్నికలు సెప్టెంబర్ నివహిస్తామని ఇది వరకే చెప్పాం.. మెయిల్ కూడా పంపించాం.. మళ్లీ ఇలా మీరు అడుగుతున్నారు.. ఇదెలా ఉందట.. నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్ పూల్ లో దూకుతానన్నట్లుగా” అంటూ కౌంటర్ వేశారు.