Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » @న‌ర్త‌న‌శాల చిత్రంలోని ఎగిరెనే మనసు…. ఫుల్ వీడియో సాంగ్ గ్రాండ్ రిలీజ్

@న‌ర్త‌న‌శాల చిత్రంలోని ఎగిరెనే మనసు…. ఫుల్ వీడియో సాంగ్ గ్రాండ్ రిలీజ్

  • August 1, 2018 / 06:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

@న‌ర్త‌న‌శాల చిత్రంలోని ఎగిరెనే మనసు…. ఫుల్ వీడియో సాంగ్ గ్రాండ్ రిలీజ్

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల. శంకర ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాత. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఛ‌లో లాంటి మ్యూజికల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. . భాస్కర భట్ల రచించిన ఎగిరెనే మనసు అనే ఫుల్ సాంగ్ వీడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని అగ‌ష్టు 30న విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ.. ఛ‌లో చిత్రాన్ని మ్యూజిక‌ల్ గా ఎంత ఘ‌న‌విజ‌యం చేశారో అంద‌రికి తెలుసు. ఇప్ప‌డు మా @న‌ర్త‌నశాల ని కూడా అంత‌కు మించి విజ‌యం చేయాల‌ని కోరుకుంటున్నాను. ఛలో చిత్ర విజయంలో పాత్రకేయ మిత్రుల పాత్ర ఎంతో ఉంది. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 30న విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. ఈ సినిమాకు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సాగర్ కి, భాస్కరభట్ల గారికి, విజయ్ మాస్టర్ కి, తమ్మిరాజు గారికి, చంటి గారికి స్పెషల్ గా థాంక్స్ తెలియజేస్తున్నాను. అని అన్నారు.

చిత్ర సమర్పకులు శంకర ప్రసాద్ మాట్లాడుతూ… ఛలో సినిమా నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రాకపోవడంతో… ఐరా క్రియేషన్స్ పుట్టింది. ఐరా క్రియేషన్స్ కి నలుగురు పిల్లర్స్. ఒకరు ఆర్టిస్టులు, రెండు టెక్నీషియన్స్, మూడు మీడియా, నాలుగు తమ్మిరాజు గారు చంటి గారు. అని అన్నారు.

చిత్ర లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి మాట్లాడుతూ… ఛలోకు ఇచ్చిన సపోర్టే నర్తన శాలకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని అన్నారు.

పాట రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ… ఐరా క్రియేషన్స్ ను సొంత బ్యానర్ కింద ఫీలవుతాను. వాళ్లు కూడా నన్ను సొంత రైటర్ లా ఫీలవుతారు. అందుకే మంచి రిలేషన్ మెయింటైన్ అవుతోంది. దర్శకుడు శ్రీనివాస్ మంచి మిత్రుడు. ఆయనకు ఐరా క్రియేషన్స్ లో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. మంచి రచయిత. ఆయనకు ఆల్ ది బెస్ట్ . మహతి సాగర్ తో ఛలో చిత్రంలో చూసి చూడంగానే తర్వాత ఎగిరెనే అనే పాట రాశాను. నాకు చాలా చాలా ఇష్టమైన పాట. మాది హిట్ కాంబినేషన్ గా కొనసాగుతుంది. మంచి సిచువేషన్ లో వచ్చే సాంగ్ ఇది. సినిమా రిలీజ్ కు ముందే ఫుల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు గట్స్ కావాలి. సినిమా పెద్ద హిట్ అవుతుందని సూచన ప్రాయంగా చెప్పేశారు. అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ మాట్లాడుతూ… నా డార్లింగ్ శౌర్య నా పెద్ద సపోర్ట్. శంకర్ ప్రసాద్ గారు, ఉష గారు టెక్నీషియన్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ అమేజింగ్. ఛలో తర్వాత నన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి. డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఫ్రీడమ్, స్పేస్ ఇచ్చారు. భాస్కర్ భట్ల గారు చూసి చూడంగానే అనే పెద్ద హిట్ ఇచ్చారు. ఈ సాంగ్ కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. మా టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థాంక్స్. ఎగిరెనే సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. సూపర్ హ్యాపీ. అని అన్నారు.

డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ… ఫస్ట్ లుక్ నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి… ఉషా గారికి, శంకర్ ప్రసాద్ గారికి, బుజ్జి గారికి చాలా చాలా థాంక్స్. శౌర్య ఈరోజు ఇక్కడ లేడు. ఆయన ఉంటే ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటాం. నేను సినిమా మొదలు పెట్టినప్పుడు ఇంత పెద్ద సినిమాగా అవుతుందనుకోలేదు. ప్రతీ రోజు పండగ లాగానే జరిగింది. ఈ సాంగ్ కోసం జర్నీ చేశాం. అరగంటలో మహతి ఈ ట్యూన్ ఇచ్చేశారు. నాకు సాగర్ రూపంలో మంచి టెక్నీషియన్ దొరికారు. మెలోడి అనగానే మాకు గుర్తొచ్చే మనిషి భాస్కర భట్ల గారు. సింగిల్ వెర్షన్ లో సాంగ్ ఇచ్చారు. సౌండ్ డిపార్ట్ మెంట్ కి చాలా చాలా థాంక్స్. డిఓపి విజయ్ గారు పండగ లా తీసిచ్చారు. సినిమా అంతా కూడా అలాగే ఉంటుంది. విజువల్స్ ని అంత బ్యూటిఫుల్ గా మలిచారు. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు బ్యాక్ గ్రౌండ్ లో సూపర్బ్ వర్క్ చేశారు. పద్మశ్రీ యాడ్స్ నుంచి సూపర్బ్ డిజైన్స్ చేసిచ్చారు. విజయ్ మాస్టర్ గారు అద్భుతమైన కొరియోగ్రఫి అందించారు. తమ్మిరాజు గారికి చంటి గారికి చాలా థాంక్స్. నాగశౌర్య, కష్మీరా, యామిని స్క్రీన్ మీద మ్యాజిక్ చేశారు.

హీరోయిన్ యామినీ మాట్లాడుతూ… ఐరా క్రియేషన్స్ ఒక ఫ్యామిలీ లా ఉంటుంది. మా డైరెక్టర్ గారికి చాలా థాంక్స్. సాగర్ థాంక్యూ సో మచ్. ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. మీడియా సపోర్ట్ కావాలి. నర్తనశాల అందరూ గుర్తుపెట్టుకునే సినిమా అవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nartanasala
  • #Nartanasala 2018 Movie
  • #Nartanasala First Look
  • #Nartanasala Movie
  • #Nartanasala Songs

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

6 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

1 day ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

1 day ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

2 days ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

2 days ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version