జూలియట్ పైనే నవీన్ చంద్ర ఆశలన్నీ

అప్పుడెప్పుడో వచ్చిన ‘అందాల రాక్షసి’ సినిమాలో కనిపించిన నవీన్ చంద్రను యువత తమ గుండెల్లో పెట్టుకొన్నారు. అందుకు కారణాలు చాలా ఉండొచ్చు కానీ.. అతడి డైలాగ్ డెలివరీ, రఫ్ లుక్ కి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. రీసెంట్ గా “నేను లోకల్” సినిమాలో సపోర్టింగ్ రోల్ లోనూ మెప్పించాడు నవీన్ చంద్ర. సరైన సబ్జెట్ దొరక్క క్లిక్ అవ్వడం లేదు కానీ.. సరిగ్గా కాన్సన్ ట్రేట్ చేస్తే స్టార్ హీరోగా ఎదగడానికి కావాల్సిన అన్నీ లక్షణాలు పుష్కలంగా ఉన్న హీరో నవీన్ చంద్ర. గతేడాది హీరోగా నవీన్ చంద్ర నటించిన సినిమా ఒక్కటి కూడా విజయం దక్కించుకోలేకపోవడం, ఇటీవల విడుదలైన చిత్రాలు దారుణమైన పరాజయం పాలవ్వడంతో ఇక నవీన్ చంద్ర సంగతి అయిపోయిందనుకొన్నారు. కానీ.. తనలోని సత్తాను ప్రూవ్ చేసుకొనేందుకు మళ్ళీ సిద్ధమవుతున్నాడు నవీన్ చంద్ర.
నవీన్ చంద్ర-నివేదా థామస్ జంటగా రూపొందిన చిత్రం “జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్”. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 15న విడుదలవుతోంది. నివేదా థామస్ నటన ప్రత్యేక ఆకర్షణగా విడుదలవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. అలాగే.. నవీన్ చంద్ర హీరోగా నిలదొక్కుకోవడానికి కూడా ఈ చిత్ర విజయం కీలకంకానుంది. అందుకే ప్రత్యేకమైన శ్రద్ధతో నవీన్ చంద్ర సినిమాని ప్రమోట్ చేస్తున్నాడట. ఆల్రెడీ తన స్నేహితులకు స్పెషల్ షో ద్వారా చూపించాడట. అలాగే.. తనకు తెలిసిన మీడియా ఫ్రెండ్స్ కి కూడా సినిమా చూపించి జెన్యూన్ గా నచ్చితేనే ప్రమోట్ చేయండని చెబుతున్నాడట. మరి నవీన్ చంద్ర కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందో లేదో చూడాలి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus