ఇండియన్ వెర్షన్ గాడ్ ఫాదర్ లా ఉంది కదా ట్రైలర్

  • August 25, 2018 / 07:33 AM IST

ప్రతి ఇండియన్ ఫిలిమ్ మేకర్ కి “గాడ్ ఫాదర్” సినిమా అనేది ఒక డెమో క్లాస్ లాంటిది. తెలుగులో మణిరత్నం “నాయగన్” సినిమాతో ఆ మ్యాజిక్ కి రీక్రియేట్ చేసినా ఇప్పటికీ చాలామందికి “గాడ్ ఫాదర్” సినిమా అంటే ఒక క్లాసిక్. అయితే.. మళ్ళీ మణిరత్నం తనదైన మ్యాజికల్ స్క్రీన్ ప్లే & క్యాస్టింగ్ తో ఇండియన్ ఆడియన్స్ “గాడ్ ఫాదర్”ను మర్చిపోయేలా చేయడానికి సన్నద్ధమవుతున్నాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “నవాబ్”. శింబు, విజయ్ సేతుపతి, అరవిందస్వామి, అరుణ్ విజయ్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న ఈ క్రైమ్ డ్రామా ట్రైలర్ ను ఇవాళ విడుదల చేశారు.

ఒక మాఫియా కుటుంబం, కుటుంబ పెద్ద ప్రకాష్ రాజ్ తర్వాత ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే విషయంలో కొడుకులతోపాటు ఒక స్నేహితుడు కూడా పోటీ పడితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ లో కనిపించిన స్టార్ హీరోలు, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, రెహమాన్ మ్యూజిక్ కలగలిసిన “నవాబ్” ట్రైలర్ చూస్తుంటే.. సినిమా “నాయగన్” రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు, దర్శకుడిగా మణిరత్నంని ఈ తరానికి ఘనంగా పరిచయం చేసేలా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus