మెగాస్టార్ చిరంజీవి లైన్ గురించి అందరికీ తెలిసిందే. వరుసగా నాలుగు సినిమాల కోసం బ్యాక్‌డ్రాప్ సిద్ధం చేసుకున్నారు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి తన లైనప్‌లో చిన్నపాటి మార్పు చేశారని తెలుస్తోంది. దాని ప్రకారం నాలుగో సినిమా కాస్త మూడో సినిమాగా మారుతోందట. అవును ముందుగా వేసుకున్న నెంబరింగ్ ప్రకారం నాలుగులో ఉన్న బాబీ సినిమా… మూడులోకి వస్తుందట. చిరంజీవి చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్న విషయం తెలిసిందే.
‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవ్వగా… త్వరలో ‘లూసిఫర్’ రీమేక్ మొదలవుతుంది. దీని తర్వాత మెహర్ రమేశ్ ‘వేదాళం’ రీమేక్, బాబీ – మైత్రి మూవీ మేకర్స్ సినిమా ఉన్నాయి. అయితే ‘వేదాళం’ రీమేక్ కంటే ముందే బాబీ సినిమా మొదలవుతుందని తాజా టాక్. వరుసగా రెండు రీమేక్‌లు వస్తే బాగుండదు అనో, ఇంకేదో కారణమో కానీ… మెహర్ రమేశ్ నెంబరు 4కి వెళ్లిపోయిందట. ఈ పుకార్లకు తగ్గట్టుగానే బాబీ తన కథకు తుది మెరుగులు దిద్దుతున్నారట.
మరోవైపు కాస్టింగ్ విషయంలోనూ పనులు మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగానే హీరోయిన్గా సోనాక్షీ సిన్హాను ఓకే చేయించుకునే పనిలో ఉన్నారట. మరోవైపు మరో కీలక పాత్ర కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీని సంప్రదించారట. అయితే ఆయన నుండి ఏం సమాధానం వచ్చిందనేది తెలియడం లేదు. ఒకవేళ ఈ టాక్స్ ఓకే అయితే.. కాంబినేషన్ సూపర్ ఉంటుంది అసలు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!