Nayantara, Vignesh: నెట్ ఫ్లిక్స్ లో నయన్ పెళ్లి స్ట్రీమింగ్..?

  • June 6, 2022 / 10:14 AM IST

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లిని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఈ నెల 9న ఒక్కటి కాబోతున్న ఈ జంట పెళ్లిని ఓటీటీలో చూడొచ్చంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే లైవ్ ఇస్తారా..? లేక మొత్తం షూట్ చేసి సినిమా మాదిరి ప్రెజంట్ చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.

మహాబలిపురంలో వీరి పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. ఆ తరువాత నూతన జంట తిరుమలకు వెళ్లి స్వామివారి ఆశీర్వాదం తీసుకోబోతున్నారట. ఇదంతా కవరేజ్ లో భాగంగా చూడొచ్చని చెన్నై మీడియా కథనాలు ప్రచురిస్తోంది. దీనికి గౌతమ్ మీనన్ దర్శకత్వం పర్యవేక్షణ చేస్తారని టాక్. మొన్నామధ్య గౌతమ్ మీనన్.. తెలంగాణ ప్రభుత్వం కోసం బతుకమ్మ పాటను తీశారు.

ఈ సాంగ్ లో పిక్చరైజేషన్ బాగా హైలైట్ అయింది. ఇప్పుడు నయనతార వెడ్డింగ్ కి సంబంధించిన షూట్ మొత్తం ఆయనే కంట్రోల్ లోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. చాలా ఏళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతుంది. వీరి పెళ్లి చూడాలని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజంగానే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయితే గనుక ఫ్యాన్స్ కి పండగే.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నయనతార తెలుగులో ‘గాడ్ ఫాదర్’ అనే సినిమాలో నటిస్తోంది. చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాలో అతడి సిస్టర్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది నయన్. ఇక విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన ‘కన్మణి రాంబో ఖతీజా’ అనే సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్ లో ఈ సినిమా ఓ మాదిరికి ఆడింది. తెలుగులో మాత్రం వర్కవుట్ అవ్వలేదు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus