కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ విగ్నేష్ శివన్ సెప్టెంబర్ 18 ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఈయన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారాయి. విగ్నేష్ గత కొంతకాలంగా నటి నయనతారతో ప్రేమలో ఉంటూ గత ఏడాది ఆమెను ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇలా వీరిద్దరీ వివాహం తర్వాత ఈ జంట పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారిపోయారు. ప్రస్తుతం వీరి పిల్లలతో ఈ జంట ఎంతో బిజీగా సంతోషంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే విగ్నేష్ తనకు తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా నయనతార తనకు సర్ప్రైజ్ బర్త్డే విషెస్ తెలియజేశారు.
ఈ క్రమంలోనే తన పిల్లల తరపున తన భర్తకు నయనతార పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా కేక్ కూడా కట్ చేయించే సెలబ్రేషన్స్ చేయించారు. ఇక హ్యాపీ బర్త్ డే అప్ప అంటూ తన పిల్లలు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఈమె అన్ని అరేంజ్మెంట్ చేశారు. ఇక రెండు కేకులను కూడా తెప్పించి ఘనంగా తన పుట్టినరోజు వేడుకలను సెలెబ్రేట్ చేశారని తెలుస్తుంది.
ఇక ఇదే విషయాన్ని విగ్నేష్ (Vignesh Shivan) సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు పిల్లలు పుట్టిన తర్వాత జరుపుకుంటున్నటువంటి మొదటి పుట్టిన రోజు వేడుక అని తనకు ఇలాంటి సర్ప్రైజ్ ఇచ్చినందుకు నయనతారకు అలాగే తన పిల్లలకు కూడా ఈయన స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఇక ఈ ఫోటోలలో నలుగురు కూడా ఒకే రకమైనటువంటి దుస్తులను ధరించి సందడి చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు కూడా ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!