పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యింటే ఫిబ్రవరిలో విడుదలవ్వాల్సిన ‘కిరాక్ పార్టీ’ కారణాంతరాల వలన నిన్న విడుదలైంది. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ ‘కిరిక్ పార్టీ’ రీమేక్ గా రూపొందిన ఈ కాలేజ్ డ్రామాకి నిఖిల్ అండ్ టీం ఎంత పబ్లిసిటీ చేసినా.. ఎన్ని ఉర్లు తిరిగి ప్రమోట్ చేసినా సినిమాకి రావాల్సినంత క్రేజ్ రాకపోవడమే కాక నిన్న రివ్యూలు కూడా యావరేజ్ గానే వచ్చాయి. దాంతో.. టీం మొత్తం ఫైనల్ రిజల్ట్ అండ్ కలెక్షన్స్ విషయంలో కంగారు పడుతోంది. సోలో రిలీజ్ అయ్యుంటే ఇంత కంగారుపడేవారు కాదేమో. కానీ.. ఇప్పుడు లైన్ లోకి నయనతార వచ్చింది.
నయనతార తమిళంలో నటించగా ఘన విజయం సొంతం చేసుకొన్న “అరమ్” చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి మార్చి 16న విడుదల చేస్తున్నారు. సిన్సియర్ ఫిలిమ్ అయిన ఈ చిత్రంపై ప్రీమియర్ షోస్, పాజిటివ్ మౌత్ టాక్ వల్ల విపరీతమైన పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. దాంతో నిఖిల్ “కిరాక్ పార్టీ” కంటే ఎక్కువగా జనాలు “కర్తవ్యం” చిత్రం కోసం ఎదురుచూడడం ప్రారంభించారు. మరి నయనతార సినిమా ఎఫెక్ట్ నిఖిల్ సినిమాపై ఏమేరకు ప్రభావం చూపుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.