లేడీ సూపర్ స్టార్ నయనతారకు సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈమె ఒక సినిమాకు కమిట్ కావాలంటే పలు డిమాండ్స్ తో పాటు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు తల బాదుకుంటున్నారు. ఈమెకు రెమ్యూనరేషన్ ఇవ్వడమే కాకుండా తన స్టాఫ్ ఖర్చులు కూడా నిర్మాతలు భరించాలంటూ నిర్మాతలకి షాక్ ఇస్తుంది. అయితే ఈమె క్రేజ్ దృష్టిలో ఉంచుకున్న కొందరు నిర్మాతలు ఇందుకు ఒప్పుకోగా మరికొందరు మాత్రం సైడ్ అవుతున్నారు.
నయనతార పెళ్లికి ముందు ఒక్కో సినిమాకు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక పెళ్లి తర్వాత ఈమె మరింత రెమ్యూనరేషన్ పెంచారని తెలుస్తుంది.ఇకపోతే తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇందులో హీరోయిన్ గా కాకుండా మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నయనతార నటించారు. నయనతారకు జోడిగా ఈ సినిమాలో సత్యదేవ్ సందడి చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన నయనతార లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే నయనతార ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో కాకపోయినా హీరో చెల్లెలు పాత్రలో నటించినప్పటికీ ఈ సినిమాకి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తుంది.ఈ సినిమాలో నటించినందుకుగాను ఈమె మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇలా చెల్లెలి పాత్రలో నటించడానికి అలాగే ఈమె కాల్ షీట్స్ కూడా తక్కువగా ఉన్నప్పటికీ
ఈమె మాత్రం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ సమాచారం. అయితే ఈమెకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు కూడా మారు మాట్లాడకుండా తనకు భారీ మొత్తంలోనే ముట్ట చెప్పారని తెలుస్తుంది.ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆచార్య ప్లాప్ తర్వాత మెగాస్టార్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.