కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార-విగ్నేష్ శివన్ ల చుట్టూ తమిళ మీడియా తిరుగుతూ ఉంటుంది. ప్రేక్షకులలో వీరి బంధంపై ఉన్న ఆసక్తి అలాంటిది మరి. వీరు ప్రతి కదలికలను గమనిస్తూ ఆసక్తికర కథనాలు రాస్తూ ఉంటారు. తాము ప్రేమికులమని బహిరంగంగానే చెప్పేసిన ఈ జంట, పబ్లిక్ గా చెన్నై నగరంలో చక్కర్లు కొడుతూ ఉంటారు. ప్రత్యేక సంధర్భాలలో రొమాంటిక్ టూర్స్ వేస్తూ ఉంటారు. ఐతే పెళ్లి విషయంలో మాత్రం నోరు మెదపరు.
ఈ మధ్య వీరి పెళ్లిపై కోలీవుడ్ మీడియాలో వరుస కథనాలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ విగ్నేష్ శివన్ వీటిపై స్పందించారు. మేమిద్దరం డేటింగ్ ఎంజాయ్ చేస్తున్నామని, బోరుకొట్టినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాం అని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఐదేళ్లకు పైగా డేటింగ్ లో ఉన్న ఈ జంట పెళ్లి మినహా మిగతా వన్నీ చేసేస్తున్నారు. నయనతార కేరళ కుట్టి కావడంతో నిన్న ప్రియుడిని తీసుకొని స్పెషల్ ఫ్లైట్ లో కొచ్చి ఎయిర్ పోర్ట్ లో దిగింది.
నేడు నయనతార కుటుంబ సభ్యులతో విగ్నేష్ కలిసి ఓనమ్ జరుపుకుంటున్నారు ఇక పెళ్లి కాకుండానే నయనతార కుటుంబ సభ్యులు అల్లుడికి సకల మర్యాదలు చేస్తున్నారు. కేరళలో నయనతార, విగ్నేష్ శివన్ ల పండగ సెలబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు.