స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ 7 ఏళ్ళ డేటింగ్ కు గుడ్ బై చెప్పి భార్యా భర్తలు కాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే పెళ్లి షాపింగ్, ఆహ్వానపత్రికలు పంచిపెట్టడం వంటి వాటితో బిజీ బిజీగా గడుపుతున్నారు. బంధు మిత్రులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకి హాజరుకానున్నారు. పెళ్లి తర్వాత రిసెప్షన్ ను ఏర్పాటు చేసుకుని సినీ పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీలు అందరినీ ఆహ్వానించేందుకు వీరు రెడీ అవుతున్నట్టు టాక్ నడుస్తుంది.
కానీ దాని పై స్పష్టత లేదు. అయితే ఇప్పటికే కొందరు గెస్ట్ ల కోసం ‘డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్’ని కూడా పంపించడం జరిగిందట. ఆ వెడ్డింగ్ కార్డు కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. ఈ వెడ్డింగ్ ప్రకారం నయన–విఘ్నేష్ లు తమిళనాడులోని మహాబలిపురంలో పెళ్లిచేసుకోబోతున్నట్టు స్పష్టమవుతుంది.కొద్ది రోజుల క్రితం వీరి పెళ్లి తిరుపతిలో జరుగుతుందనే ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని.. మహాబలిపురంలో జరగబోతున్నట్టు ఈ వెడ్డింగ్ కార్డు ద్వారా బయటపడింది.
ఓ రిసార్ట్లో ఈ వేడుక జరగబోతుందని సమాచారం.వధూవరులకు, బంధు మిత్రులకు అక్కడే బస ఉంటుందట. వీళ్ళ పెళ్ళికి టాలీవుడ్ ప్రముఖులు ఎవరెవరు వెళ్తారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది మరో పక్క.. ఆకాశం, అందమైన ఇల్లు, చుట్టూ పచ్చని చెట్లతో డిజైన్ చేసిన డిజిటల్ ఇన్విటేషన్ కార్డ్ అందరినీ ఆకట్టుకుంటుంది. పెళ్లంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకునే వేడుక కాబట్టి వెడ్డింగ్ కార్డు ను చాలా కాస్ట్లీ గా డిజైన్ చేయించుకున్నట్టు ఉన్నారు.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!