Nazriya: ఆర్ఆర్ఆర్ స్టార్స్ పై దృష్టి పెట్టిన నజ్రియా?

  • June 8, 2022 / 05:52 PM IST

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన నజ్రియా నటించిన సినిమాలు తక్కువే అయినా ఆమె నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. మరో రెండు రోజుల్లో నజ్రియా నటించిన అంటే సుందరానికి సినిమా థియేటర్లలో విడుదల కానుంది. నజ్రియా మాట్లాడుతూ తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం కష్టంగా అనిపించలేదని ట్రాన్స్ లేటర్ సహాయంతో పాత్ర, సంభాషణలను అర్థం చేసుకొని నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. నాకు తెలుగులో కూడా సినిమాలు చేయాలని ఉందని అయితే ఇన్నేళ్లు సరైన కథ దొరకలేదని ఆమె చెప్పుకొచ్చారు.

అంటే సుందరానికి సినిమాలో ఫన్ తో పాటు ఎమోషన్ కూడా ఉందని ఆమె వెల్లడించారు. అంటే సుందరానికి అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా కుదిరిన స్క్రిప్ట్ అని ఆమె కామెంట్లు చేశారు. ఆ కారణం వల్లే స్క్రిప్ట్ విన్న వెంటనే చేస్తానని ఓకే చెప్పానని నజ్రియా చెప్పుకొచ్చారు. పెళ్లి విషయంలో కులమతాల పట్టింపులు ఉండకూడదని ఆమె కామెంట్లు చేశారు. ఒకే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నా హ్యాపీగా ఉంటారని చెప్పలేమని ఏ బంధమైనా ప్రేమతో ముడిపడి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

నేను సాధారణ ప్రేక్షకురాలిలా స్క్రిప్ట్ వింటానని నజ్రియా కామెంట్లు చేశారు. కథ నచ్చితే భాషతో సంబంధం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తానని ఆమె చెప్పుకొచ్చారు. తెలుగులో వెంటనే సినిమాలు చేయాలని ఉందని నజ్రియా వెల్లడించారు. మంచి స్క్రిప్ట్ వస్తుందా? లేదా? అనేది చూడాలని మంచి కథ దొరికితే ఏ భాషలో అయినా నటించడానికి తాను సిద్ధమేనని ఆమె కామెంట్లు చేశారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబులతో కలిసి నటించాలని ఉందని ఆమె చెప్పుకొచ్చారు. మా పెళ్లి చాలా సాఫీగా జరిగిందని నా ప్రేమ కథలో డ్రామా ఉండాలని కోరుకోగా ఆ కోరిక నెరవేరలేదని ఆమె వెల్లడించారు. మేమిద్దరం నటులమే కాబట్టి సినిమాల గురించి బాగా చర్చించుకుంటామని ఆమె తెలిపారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus