టాలీవుడ్‌లో తనదైన శైలిలో దూసుకుపోతున్న నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఆయన, తాజాగా ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించడం విశేషం.
అయితే ఈ ఈవెంట్‌లో జరిగిన ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. సీనియర్ నటి హేమమాలిని ని చూసిన బాలయ్య, ఆమెకు పాదాభివందనం చేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా అలాంటి సందర్భాలు అరుదుగా కనిపించడంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. అభిమానులు బాలయ్య వినయానికి ఫిదా అవుతుంటే, మరికొందరు సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య అని అభిప్రాయపడుతున్నారు.
ఇండస్ట్రీలో అగ్రహీరోగా కొనసాగుతూ, ప్రజాప్రతినిధిగా కూడా సేవలందిస్తున్న బాలయ్య ఇలా తన వినయాన్ని చాటుకోవడం విశేషం. ఇది ఆయన వ్యక్తిత్వాన్ని మరో కోణంలో చూపించింది. అడపా దడపా ఇబ్బంది పడ్డప్పుడు అభిమానుల మీద ఆగ్రహాన్ని చూపించే బాలయ్య, పెద్దలు మరియు చిన్న పిల్లల పట్ల చాలా ఔదార్యాన్ని చూపిస్తాడు.
సినిమాల విషయానికి వస్తే, ఇటీవల వచ్చిన ప్రాజెక్ట్ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, ఆయన తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఆయన మరోసారి జతకట్టగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది.