‘ఎన్టీఆర్’ ట్రైలర్, ఆడియో రిలీజ్ డేట్లు అనౌన్స్ చేశారు

  • December 13, 2018 / 09:18 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా దివంగత నేత ఎన్టీఆర్ జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రనికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి పార్ట్ ను ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ గా రెండవ పార్ట్ ను ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా వాటికి మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంబంచిన మరొక ఆసక్తికర విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్ వెల్లడించింది.

డిసెంబర్ 16 న ఈ చిత్ర ట్రైలర్ ను , అలాగే డిసెంబర్ 21 న ఆడియోని రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఖరారు చేసింది. వారాహి క్రియేషన్స్ మరియు ఎన్బికే ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. కాస్టింగ్ తోనే ఈ చిత్రం మంచి హైప్ ను సొంతం చేసుకుంది. ‘బసవతారకం’ పాత్రలో విద్యా బాలన్, ‘మహానటి’ సావిత్రి పాత్రలో నిత్యా మీనన్, జయప్రద పాత్రలో తమన్నా , ఆంధ్రప్రదేశ్ సీఎం మరియు ఎన్టీఆర్ అల్లుడి అయిన చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus