గౌతమీపుత్ర శాతకర్ణి పై చక్కర్లు కొడుతున్న రూమర్
- December 22, 2016 / 07:28 AM ISTByFilmy Focus
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ నందమూరి అభిమానుల మనసుదోచుకుంది. బాలయ్య డైలాగ్స్ తోడు, విజువల్ ఎఫక్ట్స్ అందరినీ అబ్బురపరిచాయి. అందుకే అత్యంత వేగంగా రెండు మిలియన్ వ్యూస్ కి క్రాస్ చేసింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో ఈ వీడియోని 20 లక్షల పదమూడు వేల మంది చూసారు. అంతటి రెస్పాన్స్ రావడంతో కొంతమంది ‘గౌతమీపుత్ర శాతకర్ణి” పై అసత్య ప్రచారానికి దిగారు. ఈ ట్రైలర్ లోని విజువల్ వర్క్స్ చాలా వరకు బాలీవుడ్ లో సంజయ్ లీలా బన్సాలి తీసిన ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రం నుంచి కాపీ కొట్టారని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
అతితక్కువ కాలంలో ఇంతటి గ్రాఫిక్ ఎలా కుదిరిందని ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలపై చిత్ర బృందం స్పందించలేదు. కానీ నందమూరి అభిమానులు మాత్రం ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు. దర్శకుడు క్రిష్ బృందం సమిష్టి కృషి కి ఇది నిదర్శమని చెప్పారు. గ్రాఫిక్, విజువల్ ఎఫెక్ట్ కోసమే ముందు యాక్షన్ సన్నివేశాలు డైరక్టర్ చిత్రీకరించారని, ఆ ఫ్యూటేజ్ ని మూడు బృందాలకు అప్పగించి వేగంగా వర్క్ చేయించారని వివరించారు. ట్రైలర్ చూసి తట్టుకోలేని వారు, మౌనంగా ఉండాలని, అనవసరపు ప్రచారానికి దిగి సినిమాను దెబ్బతీయవద్దని హితవు పలికారు. రాజీవ్ రెడ్డి, సాయి బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















