జూన్ 6వ తేదీ దగ్గుబాటి వంశీయులకు మాత్రమే కాదు యావత్ తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేకమైన రోజు. నిర్మాతగా తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేయడంతోపాటు, అత్యధిక భాషల్లో చిత్రాలు నిర్మించినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సైతం సంపాదించుకొన్న ఏకైక నిర్మాత డి.రామానాయుడు పుట్టినరోజు. ఆయన దూరమైనా దగ్గుబాటి కుటుంబం మాత్రమే కాదు ఏ తెలుగు సినిమా అభిమాని ఆయన్ను మరువడు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా యువ కథానాయకుడు రామానాయుడు వారసుడు రాణా తన తాజా చిత్రమైన “నేనే రాజు నేనే మంత్రి” టీజర్ ను విడుదల చేశారు. సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బాబు-కిరణ్ రెడ్డి-భారత్ చౌదరి నిర్మాతలు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పోలిటికల్ థ్రిల్లర్ లో రాణా సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.