సినీ నటుడు చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా సినిమాలలో నటిస్తున్నారు. అయితే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈయనకు కాస్ట్యూమ్ డిజైనర్ గా తన పెద్ద కుమార్తె సుస్మిత వ్యవహరిస్తున్నారు. సుస్మిత చిరంజీవితో పాటు రామ్ చరణ్ కి కూడా పలు సినిమాలలో కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు.
అయితే ఈమె కాస్ట్యూమ్ డిజైనింగ్ విషయంలో కాస్త మారాల్సిన అవసరం ఉందంటూ పలువురు భోళా శంకర్ సినిమా చూసిన తర్వాత ఈమె పట్ల విమర్శలు కురిపిస్తున్నారు.ఈమె చాలా పాత మోడల్ ఉన్న బట్టలనే తిరిగి డిజైన్ చేస్తున్నారని అలా కాకుండా కొత్తగా చూపించడం కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా అలాగే వాల్తేరు వీరయ్య సినిమా కాస్త హిట్ అవడంతో కాస్ట్యూమ్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు.
మిగిలిన ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలలో చిరంజీవి కాస్ట్యూమ్స్ ఏమాత్రం బాగాలేవని పలువురు సుస్మిత పై విమర్శలు చేస్తున్నారు. ఇక తన తండ్రికి డిజైన్ చేసే సమయంలో సుస్మిత సరికొత్తగా ఆలోచించి డిజైన్ చేస్తే బాగుంటుందని లేకపోతే ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా తప్పకున్న ఇంకా బాగుంటుంది అంటూ పలువురు భావిస్తున్నారు.అయితే రంగస్థలం సినిమాలో చరణ్ కోసం చేసినటువంటి డిజైనింగ్ చాలా అద్భుతంగా సెట్ అయిందని కూడా తెలుపుతున్నారు.
ఇకపోతే చిరంజీవి (Chiranjeevi) తన తదుపరి సినిమాని సుస్మిత గోల్డెన్ బాక్స్ నిర్మాణ సంస్థలో చేయబోతున్నారు ఈ సినిమాకు ఈమె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు మరి ఈ సినిమాకు కూడా ఈమెనే కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తారా లేక ఇతరులను నియమిస్తారో అనే విషయం తెలియదు కానీ ఈ విషయంలో మాత్రం తాను మారాల్సిందేనంటూ అభిమానులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.