Amitabh Bachchan: ఆ నిజాయితీ చూసి ఆశ్చర్యం వేసింది: బిగ్ బీ

  • July 21, 2022 / 12:01 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ గురించి తెలియని వారంటూ ఉండరు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన అమితాబచ్చన్ అక్కడ స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా ఆయన ఎన్నో సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. చిరంజీవి హీరోగా నటించిన సైరా సినిమాలో అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈయన నటుడిగా మాత్రమే కాకుండా హోస్ట్ గా కూడా మంచి గుర్తింపు పొందాడు.

బాలీవుడ్ లో ప్రసారమవుతున్న కౌన్ బనేగా కరోడ్ పతి అనే రియాలిటీ షోలో ఎన్నో సంవత్సరాలుగా అమితా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అంతే కాకుండా వాణిజ్య ప్రకటనలో కూడా నటిస్తూ బిగ్ బి ఎప్పుడూ బిజిగా ఉంటాడు. ఇదిలా ఉండగా అమితాబ్ బచ్చన్ తరచు తన వ్యక్తిగత బ్లాగ్‌లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవల తనకి ఓ ఐదేళ్ల పిల్లవాడితో జరిగిన సంభాషణను బిగ్ బి తన బ్లాగ్‌లో షేర్ చేశారు.

ఇటీవల బచ్చన్ ఓ ప్రచార ప్రకటన కోసం షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ ఐదేళ్ల పిల్లవాడు తనను కలిశాడని తెలిపారు. ఆ సమయంలో ఆ పిల్లవాడు అమితాబ్‌ బచ్చన్‌ను వయస్సు గురించి అడిగితే బిగ్ బి తన వయస్సు చెప్పాడట. ఆ తర్వాత ఆ పిల్లవాడి నుండి వచ్చిన సమాధానం బిగ్ బి ఆశ్చర్యపోయాడట. బిగ్ బి వయసు చెప్పిన తర్వాత ఆ పిల్లవాడు మాట్లాడుతూ.. అయ్యో! ఇప్పుడు కూడా అలా ఎందుకు పని చేస్తున్నావు? మా తాతలు ఇంట్లో కూర్చుని చల్లగా ఉన్నారు ..

మీరు కూడా అలా చేయాలి అని అన్నాడని బచ్చన్ రాసుకొచ్చారు. ఆ ఐదేళ్ల కుర్రాడు అన్న మాటలకు నా దగ్గర సమాధానం లేదు .. నిజంగా చెప్పాలంటే ఆ ఐదేళ్ల పిల్లాడి నిజాయితీని చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటూ రాసుకొచ్చారు. షూటింగ్ ముగిసిన తర్వాత అతనికి ఆటోగ్రాఫ్ ఇచ్చి వీడ్కోలు చెప్పి వెళ్లిపోయానని అమితాబ్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం అమితాబచ్చన్ అరడజను పైగా సినిమాలలో ప్రధాన పాత్రలలో నటిస్తు బిజీ బిజీగా గడుపుతున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus