శనివారం రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మొదట కత్తి మహేష్ కోలుకుంటున్నారని వార్తలు రాగా అనూహ్యంగా కత్తి మహేష్ మృతి చెందారని తెలిసి ఆయన అభిమానులు షాకయ్యారు. అయితే ఆయన ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కత్తి మహేష్ మృతిపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు స్పందిస్తే మాత్రమే కత్తి మహేష్ మృతి గురించి వ్యక్తమవుతున్న అనుమనాలకు జవాబు దొరికే అవకాశం ఉంటుంది.
సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన కత్తి మహేష్ కంటికి, ముఖానికి గాయాలయ్యాయి. అయితే ఊపిరితిత్తుల్లోకీ నీరు చేరడం వల్ల కత్తి మహేష్ ఆరోగ్యం విషమంగా మారింది. కత్తి మహేష్ చనిపోవడానికి ముందే ఆయనకు ఆక్సిజన్ పైప్ పీకేశారని, వెంటిలేటర్ ను తొలగించారని కొందరు నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. కత్తి మహేష్ కు ఆక్సిజన్, వెంటిలేటర్ ను తొలగించడం గురించి నివేదిక ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు. నేడు కత్తి మహేష్ స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి.
కత్తి మహేష్ మృతి విషయంలో ఏదో మిస్టరీ ఉందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కత్తి మహేష్ మృతి గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గడిచిన మూడు నెలల్లో సినిమా జర్నలిజానికి చెందిన టీఎన్నార్, బీఏ రాజు, కత్తి మహేష్ మృతి చెందారు. సినీ జర్నలిజానికి సంబంధించిన వ్యక్తులు వరుసగా మృతి చెందుతుండటంతో మూవీ లవర్స్ శోకసంద్రంలో మునిగిపోయారు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!