Hyper Aadi: త్రివిక్రమ్ మీద ఆది పొగడ్తల వర్షం… భజన ఎక్కువైందటు నెటిజన్ ఫైర్..?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ లో ఆది వేసే పంచులు సెటైర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కొన్ని సందర్భాలలో ఇతరుల మీద అది వేసే సెటైర్లు కూడా విమర్శలకు దారితీస్తూ ఉంటాయి. ప్రస్తుతం అది టీవీ షోలో సందడి చేయడమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలుస్తూ జనసేన పార్టీ ప్రచారం కోసం కూడా కష్టపడుతున్నాడు .

ఈ క్రమంలో అధికార పార్టీ వైసిపి ఎమ్మెల్యేలు మంత్రుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆది చేసిన ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే .ఇదిలా ఉండగా ఇటీవల ధనుష్ హీరోగా నటించిన “సార్” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది కూడా కూడా పాల్గొన్నాడు. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ఆది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ క్రమంలో త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ ఆయన మీద పొగడ్తల వర్షం కురిపించాడు. సాధారణంగా దర్శకనిర్మాతలు, హీరోల మెప్పు పొందటానికి ఇలాంటి ఈవెంట్స్ లో వారిని పొగడటం సహజం. అయితే అది మాత్రం త్రివిక్రమ్ కన్నా తోపు ఎవరూ లేరు అన్నట్లుగా మాట్లాడాడు. చేసిన ఈ వ్యాఖ్యలకు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన డైలాగుల వల్ల కూడా ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి.

త్రివిక్రమ్ కన్నా ముందే ఎంతోమంది ప్రముఖ రచయితలు రాసిన డైలాగులు వల్ల కూడా ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. అది మరిచిపోయి ఆది కేవలం త్రివిక్రమ్ మాత్రమే తోపు అన్న విధంగా మాట్లాడటంతో నేటిజన్స్ ఫైర్ అవుతూ .. ఆది నీ భజన బాగా ఎక్కువయ్యింది భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నేటిజన్ చేస్తున్న కామెంట్స్ కి ఆది ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus