Nikhil Siddharth: చూసుకోవాలి కదా నిఖిలూ.. ఇలా ఫొటోలు షేర్ చేస్తే ఎలా?
- October 27, 2026 / 09:11 PM ISTByFilmy Focus Desk
‘కార్తికేయ’ సినిమాలతో బాలీవుడ్లో నిఖిల్‌ను కార్తికేయ అనే అనుకుంటున్నారు అంటే.. ఆ సినిమాలు చూపించిన ఎఫెక్ట్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ఆ రెండు సినిమాల తర్వాత నిఖిల్‌కి ఇప్పటికి సరైన విజయం అందుకోలేదు. మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినా ఆ స్థాయి ఫలితాలు రాలేదు. ఈ క్రమంలో ‘స్వయంభు’ అనే పెద్ద సినిమాను అనౌన్స్ చేసి తన స్థాయి ఇదీ అంటూ స్టార్ హీరో స్టేటస్లవైపు అడుగులు వేశాడు. అయితే ఏమైందో ఏమో.. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు.
Nikhil Siddharth
నిజానికి సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. మూడేళ్ల క్రితం మొదలైన ఈ సినిమాను 180 రోజుల్లో పూర్తి చేస్తామని అప్పట్లో చెప్పారు. కానీ 1000 రోజులు పూర్తవుతున్నా ఇంకా రిలీజ్ విషయంలో సమాచారం రావడం లేదు. ఆ మధ్య సినిమా ప్రచారం షురూ చేశారు కూడా. కానీ మధ్యలోనే ఆ ప్రచారం ఆపేశారు. విజువల్ ఎఫెక్ట్స్ విసయంలో ఇబ్బందులే ఆ ఆలస్యానికి కారణం అని చెబుతున్నారు.
అయితే, రీసెంట్గా ఆ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు నిఖిల్ సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేశాడు. దీంతో సినిమాకు బజ్ వస్తాది అనుకుంటే.. లేనిపోని చర్చలు జరిగి, రచ్చ అయింది. విజువల్ ఎఫెక్ట్స్ మీద సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నిఖిల్‌ను ట్యాగ్ చేసి ‘స్వయంభు’ రిలీజ్ గురించి ఫ్యాన్స్ అడుగుతూనే ఉన్నారు. వాళ్ల కోసం నిఖిల్ ఒక ఇమేజ్ పోస్టు పెట్టాడు.
‘స్వయంభు’ సినిమాకు సంబంధించి కొన్ని వీఎఫెక్స్ షాట్స్‌ని రీసెంట్గా చూశానని, అద్భుతంగా ఉన్నాయని, ఈ ఏడాది బిగ్ స్క్రీన్ మీద అద్భుతాన్ని చూస్తారని రాసుకొచ్చాడు. సముద్ర తీరంలో గుర్రం మీద ఉన్న నిఖిల్ ఫొటో అది. సినిమాలోని స్టిల్ ఏమో అని అందరూ అనుకున్నారు. కానీ జూమ్ చేసి చూస్తే అది ఏఐ జనరేటెడ్ అని అర్థమవుతోంది. దీంతో ఏఐ ఫొటో అంటూ చర్చ మొదలైంది. నిఖిల్ ఏ ఉద్దేశంతో ఆ ఫొటో షేర్ చేశాడో కానీ.. ఇది కాస్తా నెగెటివ్ అయింది.















