Ravi Teja, Sreeleela: ధమాకా సాంగ్ పై నెటిజన్ల ట్రోల్స్.. ఏమైందంటే?

  • November 14, 2022 / 10:21 PM IST

త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో రవితేజ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ధమాకా సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ నెల 23వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ విడుదల కాగా ఆ సాంగ్ వల్ల రవితేజను చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ధమాకా సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీలను ఎంపిక చేయడంపై చాలామంది విమర్శలు చేశారు. అయితే తాజాగా రిలీజైన లిరికల్ సాంగ్ లో నాన్న అనే పదం రావడం అదే సమయంలో రవితేజ ఫేస్ ను స్క్రీన్ పై చూపించడం గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.

రవితేజ శ్రీలీల జోడీ చూడటానికి ఎబ్బెట్టుగా ఉందని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాయగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ధమాకా సాంగ్ విషయంలో వస్తున్న ట్రోల్స్ గురించి రవితేజ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ధమాకా సినిమాతో రవితేజ కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుసగా ఫ్లాపులు వస్తున్నా రవితేజ రెమ్యునరేషన్ ఏ మాత్రం తగ్గలేదని సమాచారం అందుతోంది.

ఒక్కో సినిమాకు మాస్ మహారాజ్ 15 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాల ఫలితాలు రవితేజను నిరాశకు గురి చేసినా రవితేజ ధమాకా సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రాజెక్ట్ ల ఎంపికలో రవితేజ జాగ్రత్త వహించని పక్షంలో ఆయన సినీ కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్స్ అయితే ఉంది. వయస్సు పెరుగుతుండటం కూడా రవితేజ కెరీర్ పై ప్రభావం చూపుతోంది. త్వరలో రవితేజ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus