Pranitha: బాత్ టబ్ లో ప్రణీత బేబీ బంప్ ఫోటో షూట్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్!

కన్నడ కస్తూరి ప్రణీత సుభాష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషలలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూనే ప్రేమించిన వ్యక్తిని గతేడాది వివాహం చేసుకున్నారు. వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న ప్రణీత తల్లి కాబోతున్న విషయాన్ని గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఈ క్రమంలోనే ప్రణీత అప్పటి నుంచి నిత్యం తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈమె బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ప్రణీత ఏకంగా బాత్ టబ్ లో బేబీ బంప్ ఫోటో షూట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఎంతో మంది నెటిజన్స్ ఈ ఫోటో పై స్పందిస్తూ పలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు కాబోయే అమ్మకు ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్ చేయగా మరికొందరు ఈ ఫోటోషూట్ పై పలు విమర్శలు చేస్తున్నారు.

ప్రెగ్నెన్సీ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి కానీ ఈ సమయంలో ఇలాంటి స్టంట్ చేయడం అవసరమా? అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ప్రణీత ఇంటిలో చాలామంది వృత్తిపరంగా డాక్టర్లు కావడంతో ఆమె పలు జాగ్రత్తలు తీసుకుని ఇలాంటి ఫోటో షూట్ నిర్వహించి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ నిత్యం తమ బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగానే డబ్బు సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.

1

2

More…

1

2

3

4

5

6

7

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus