తెలుగు డైరెక్టర్ పై మండిపడ్డ కె.జి.ఎఫ్ అభిమాని.. వైరల్ అవుతున్న ఎమోషనల్ లెటర్!

ఏ సినిమా అయినా జనాలు ఎగబడి చూసేది వినోదం కోసమే. ఇంకా చెప్పాలంటే జనాలు సినిమాకి వెళ్ళేదే ఎంటర్టైన్మెంట్ కోసం. ఇప్పటి దర్శకులు ఈ విషయాన్ని అర్థం చేసుకునే సినిమాలు చేయాలి. కొంతమంది దర్శకులు ఈ పద్ధతిని ఫాలో అయ్యే సినిమాలు చేస్తున్నారు కూడా..! ఇక ఇటీవల ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా.. ‘కె.జి.ఎఫ్’ చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్ పై తన అభిప్రాయాన్ని తెలుపుతూ కొన్ని అనవసరమైన కామెంట్లు చేశాడు. దీంతో అతని పై కె.జి.ఎఫ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

అతను ఈరోజు సారీ చెప్పిన విధానం కూడా వరస్ట్ గా ఉంది అంటూ కూడా వాళ్ళు సెటైర్లు వేస్తున్నారు. అయితే ఓ కెజిఎఫ్ అభిమాని రాసిన లెటర్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ లెటర్ ను పరిశీలిస్తే.. ” నిజమే సినిమాలో హీరో నీచ్ కమీనే కుత్తే గాడు. అతను బంగారం మొత్తం తీసుకుపోయి సముద్రంలో పడేశాడు. తాను నమ్ముకున్న జనాలకు ఇందిరమ్మ పథకంలో ఇళ్ళు మాత్రమే ఇచ్చాడు. కరెక్టే.. అయితే ఆ తల్లి కోరిక ఏంటి ఫైనల్ గా హీరో ఓ సుల్తాన్ లా చనిపోవాలి. వాడు చనిపోతే..

అతని పాడి మోసే పని కూడా ఇంకొకరికి ఉండకూడదు. అందుకే తనే చావుకెదిరెళ్ళాడు. ప్రాణాన్ని లెక్కచేయలేదు. ఇక్కడ హీరోని బాగా చదివించి గొప్పవాడవ్వాలని ఆ తల్లి కోరుకోలేదు. ముంబై రోడ్లపై వదిలేసి చనిపోయింది. అలాంటప్పుడు హీరో ఇంకెలా తయారవుతాడు.? అది కంప్లీట్ గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయ్యుండొచ్చు. ‘నీ అభిప్రాయం నువ్వు చెప్పావు అందులో తప్పు లేదు’ నిజమే తప్పులేదు వెంకటేష్ మహా.మరి ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీస్తే నీకు వచ్చిన నొప్పేంటి? నువ్వు డైరెక్ట్ చేసినవి రెండు సినిమాలు.

రెండోది వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అయినా సరే నీలా మేము నీ సినిమాలను విమర్శించం. అవి నువ్వు సేఫ్ గేమ్ లో ఆడి తీసిన సినిమాలు కాబట్టి. ‘నిన్ను ఇంత మంది తిడుతున్నారు’ అంటే అది కూడా వారి అభిప్రాయమే అవుతుంది కదా..! అందులో తప్పేముంది. ‘నేను సినిమాలో క్యారెక్టర్ ను కథను తిట్టాను’ అంటున్నావు.సినిమాలో ఆ క్యారెక్టర్ నచ్చలేదు నువ్వు తిట్టావు. నీలో ఉన్న ఈ క్యారెక్టర్ కూడా జనాలకు నచ్చి ఉండదు కాబట్టి తిడుతున్నారు. నీకు ఎమోషన్ ఉన్నట్టే, జనాలకు కూడా ఎమోషన్ ఉంటుంది కదా..!

అయినా హీరో నెగిటివ్ షేడ్స్ లో నటించిన సినిమాలు తెలుగులో రాలేదా? బిజినెస్మెన్ వంటి సినిమాలు హిట్టు కాలేదా? ‘నిజానికి నీ ఏడుపు ‘కె.జి.ఎఫ్’ సినిమా అలా ఉన్నందుకు కాదు. ఆ సినిమాని జనాలు ఎగబడి చూసినందుకు.. వందల కోట్లు ఆ సినిమా కలెక్ట్ చేసినందుకు. అది జీర్ణించుకోలేక నువ్వు ఇలా వాగుతున్నావ్. నీ వల్ల అయితే ప్రశాంత్ నీల్ రూ.180 కోట్లతో ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ తీసి రూ.1200 కోట్లు రాబట్టినట్లు.. నువ్వు కూడా అలాంటి సినిమా తియ్యి. అది ఎంత గొప్పగా ఏడుస్తాదో మేము చూస్తాం” అంటూ అగ్రెసివ్ గా స్పందించాడు ఆ అభిమాని.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus