Naga Chaitanya, Samantha: సమంత పై విరుచుకుపడుతున్న నెటిజన్లు..!

  • July 23, 2022 / 05:50 PM IST

నాగ చైతన్య విషయంలో సమంత బ్యాలన్స్ తప్పుతూ మాట్లాడుతుంది అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. చాలా మంది అభిప్రాయం కూడా ఇదే అనిపిస్తుంది. ఆమె నాగ చైతన్య పేరును సైడ్ చేస్తూ, మాజీ భర్త అంటూ ఇటీవల కరణ్ జోహార్ టాక్ షోలో అనడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయం పై ఒక్క నాగ చైతన్య అభిమానులు మాత్రమే కాదు.. మిగతా హీరోల అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా ఆమె పై మండి పడుతున్నారు.

ఈ టాక్ షోలో సమంత చేసిన హడావిడి కూడా మాములుగా లేదంటూ వారు విరుచుకు పడుతున్నారు. పెళ్లయ్యాక లైఫ్ కె.జి.ఎఫ్ లా ఉందని, చైతన్య నేను ఒకే గదిలో ఉండాల్సి వస్తే ఆయుధాలు అవసరమవుతుంది అంటూ ఈమె రెచ్చ గొట్టే కామెంట్లు చేస్తుందని వారు భావిస్తున్నారు. కానీ చైతన్య మాత్రం సమంత టాపిక్ వస్తే.. నెగిటివ్ గా స్పందించడం లేదు. చాలా కూల్ గా సమాధానాలు ఇస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో బాగుంటుంది అని ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకి సాయి పల్లవి, సామ్ అంటూ చైతన్య జవాబిచ్చాడు.

ఆ టైంలో మొహం మాడ్చుకుని చైతన్య అలా సమాధానం చెప్పలేదు. కానీ సమంత మాత్రం చైతన్య పేరు ఎత్తగానే మొహంలో ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తుంది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘జాను’ సినిమా రిలీజ్ టైంలో సమంత.. చైతన్య గురించి మా ఆయన బంగారం అన్నట్టు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పక్క రాష్ట్రంలో పాల్గొన్న ఓ టాక్ షోలో ఇంత ఆరోగెన్స్ బిహేవియర్ ఏంటి అని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus